Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New functions for Secretariat employees ... As invigilators for inter and ten examinations.

సచివాలయ ఉద్యోగులకు కొత్త విధులు...ఇంటర్ మరియు పది పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా...

ఏపీలో ఇంటర్ మరియు పది పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సమీక్ష నిర్వహించారు.. 
సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లపై.. అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్ఐవోలతో చర్చించారు. ఇంటర్ పరీక్షలు మార్చి 4 నుంచి 23వ తేదీ వరకు 20 రోజుల పాటు 1411 పరీక్ష కేంద్రాల్లో జరుగుతాయని చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు అవుతుందని మంత్రి చెప్పారు. పరీక్షల సమయంలో స్థానికంగా ఉండే జిరాక్స్ కేంద్రాలు కూడా మూసివేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉంటే మంత్రి ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను కూడా ఇన్విజిలేటర్లుగా వినియోగించుకుంటున్నామన్నారు. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైన సందర్భాల్లో మాత్రమే అన్నారు.
అంతేకాదు ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ విధానంలో కేటాయిస్తామన్నారు. ఇదిలా ఉంటే కడప జిల్లాలో ఆర్‌ఐవో.. ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటింగ్ కోసం ఇప్పటికే సచివాలయ ఉద్యోగుల జాబితాను కోరారు. హాల్ టికెట్లపై క్యూ ఆర్ కోడ్..
పరీక్షా కేంద్రాలు తెలుసుకునేందుకు యాప్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇక ఇంటర్‌లో గ్రేడింగ్‌తో పాటు మార్కులు కూడా ఇస్తామని తెలిపారు. లేని పక్షంలో పొరుగు రాష్ట్రాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు మంత్రి. మరోవైపు కాపీయింగ్ నిరోధానికి సీసీ కెమెరాలు కూడా ఉపయోగిస్తున్నామని మంత్రి తెలిపారు. పరీక్ష పత్రాలు లీకేజీ లేకుండా ఉండేందుకు చీఫ్ సూపర్‌ వైజర్ మినహా ఎవరి దగ్గర మొబైల్ ఫోన్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు సురేష్. పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ల ఏర్పాటుపైనా మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వచ్చేనెలలో మొదలుకానున్న పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఇన్విజిలేటర్లుగాను, స్క్వాడ్‌ బృందాల్లోనూ వినియోగించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. పరీక్షల ఏర్పాట్లను ఆయన బుధవారం విలేకర్లకు తెలిపారు. ఇంటర్‌ పరీక్షల్లో అధ్యాపకులు చాలనిచోట్ల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సేవలు వినియోగించుకునేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా లైవ్‌ వెబ్‌క్యాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశామని చెప్పారు. పరీక్షలు జరిగే సమయంలో ఆ కేంద్రాల సమీపంలో ఉండే జిరాక్స్‌ దుకాణాలు మూసి ఉంచాలని, 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని వివరించారు. పరీక్ష కేంద్రాల్లో చీఫ్‌ సూపరింటెండెంట్‌ మినహా మరెవరి వద్దా సెల్‌ఫోన్లు ఉండకూడదని ఆదేశించినట్లు చెప్పారు. మంత్రి తెలిపిన మరిన్ని వివరాలు..
ఇంటర్‌లో ఇన్విజిలేటర్లకూ జంబ్లింగ్‌
  •  ఇన్విజిలేటర్ల కేటాయింపునకూ జంబ్లింగ్‌ విధానం.
  •  మొదటి సంవత్సరం పరీక్షలు రాసే విద్యార్థులకు గ్రేడింగ్‌ కాకుండా, మార్కుల మెమో ఇచ్చే విధానం.
  • హాల్‌టికెట్లు bie.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌ ద్వారానే సెంటర్‌ ఎక్కడ, పరీక్ష రాసే సీటు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.
  • పరీక్ష కేంద్రం చిరునామా తెలుసుకోవడంలో ఇబ్బందులు ఉన్నవారు ‘ఐపీఈ సెంటర్‌ లొకేటర్‌’ అనే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే, అందులో మార్గం ఉంటుంది.

పదిలో 24 పేజీల బుక్‌లెట్‌
  • పరీక్షల్లో ఈసారి బిట్‌ పేపరు ఉండదు. దీనిపై అవగాహనకు మార్చి మొదటివారంలో అన్ని పాఠశాలల్లో అవగాహన సదస్సులు.

  • పేపర్‌-1, 2 తప్పనిసరిగా ఉత్తీర్ణులవ్వాలనే నిబంధన లేదు. 2 పేపర్లలో కలిపి 35 మార్కులు వస్తే చాలు.*

  • 4 పేజీల జవాబుపత్రం, అదనపు పత్రాలకు బదులు ఒకటే 24 పేజీల బుక్‌లెట్‌. దీనిపై విద్యార్థి పేరు, ఫొటో, క్యూఆర్‌ కోడ్‌ ఉంటాయి.
  • హాల్‌టికెట్లను bseap.org అనే వెబ్‌సైట్‌ ద్వారా పరీక్షల ఆరంభానికి పదిరోజుల ముందునుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.*
  • ఇంటర్‌ పరీక్షల తేదీలు
  • మార్చి 4 నుంచి 23 వరకు
  •   పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య 10.65 లక్షలు
  • మొత్తం పరీక్ష కేంద్రాలు:  1,411

  • పదో తరగతి పరీక్షల తేదీలు
  • మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 9 వరకు
  • పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య 6.39 లక్షలు
  • మొత్తం పరీక్ష కేంద్రాలు: 2,923

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New functions for Secretariat employees ... As invigilators for inter and ten examinations."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0