Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New pension cards have been issued from today. All beneficiaries will be provided by volunteers

నేటి నుంచి కొత్త పెన్షన్ కార్డులు పంపిణి.లబ్ధిదారులందరికీ వలంటీర్ల ద్వారా అందజేత. 
New pension cards have been issued from today. All beneficiaries will be provided by volunteers


రాష్ట్రంలో పింఛను పొందే లబ్దిదారులందరికీ ప్రత్యేక పెన్షన్ గుర్తింపు కార్డులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి పంపిణీ చేయనుంది.
వివిధ రకాల పింఛన్లకు సంబంధించి ఫిబ్రవరిలో 54,68,322 మందికి ప్రభుత్వం నిధులు విడుదల చేయగా . . వారందరికీ సోమవారం నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు వలంటీర్ల ద్వారా కొత్త కార్డులు పంపిణీ చేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ( సెర్చ్ ) సీఈవో రాజాబాబు తెలిపారు . ఫిబ్రవరి నెలలో కొత్తగా పింఛన్లు మంజూరైన వారికి పింఛను పుస్తకంతోపాటు గుర్తింపు కార్డు ఇస్తారు . మిగిలిన పాత పింఛనుదారులందరికీ ఇప్పటికే పింఛను పుస్తకాలు పంపిణీ చేసిన నేపథ్యంలో వారికి కొత్తగా కేవలం గుర్తింపు కార్డులను మాత్రమే పంపిణీ చేయనున్నట్లు ఆయన వివరించారు . ఇదిలావుండగా . . . అనర్హులుగా తేలిన వారికి సంబంధించి ప్రస్తుతం రీ సర్వే జరుగుతోందని , ఇందులో అర్హులుగా తేలిన వారికి మార్చి 1వ తేదీన గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు . రాష్ట్రంలో ఇప్పటికే కొత్తగా 6,14,244 మందికి పింఛన్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే .

ఫిబ్రవరిలో విభాగాల వారీగా పింఛను ' అందుకున్న లబ్ధిదారుల సంఖ్య

వృద్ధాప్య పింఛను       24,61,567 
వితంతు పింఛను.       19,78,940 
దివ్యాంగ పింఛను.      5,98,024
 చేనేత పింఛను.          97,489 
కల్లుగీత కార్మిక పింఛను  29,575
ట్రాన్స్ జెండర్ పింఛను.  2,161
ఒంటరి మహిళల పింఛను 1,35,244 మత్స్యకార పింఛను చర్మకారులు 16,443 డప్పు కళాకారులు.        26,688 
కిడ్నీ వ్యాధి బాధితులు.   10,763
పక్షవాతందీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 31,672 ఎయిడ్స్ రోగులు    31,829 

మొత్తం లబ్ది దారులు     54,68,322      



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New pension cards have been issued from today. All beneficiaries will be provided by volunteers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0