Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Railway Jobs: 570 jobs in Railways ...

Railway Jobs: రైల్వేలో 570 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే.


భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. వెస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, సెక్రెటేరియల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్-COPA లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌లో కూడా దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ 2020 ఫిబ్రవరి 15న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు మార్చి 15 చివరి తేదీ. ఈ ఉద్యోగాలకు 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్ సైట్: http://rrccr.com
మొత్తం ఖాళీలు 570


  1. ఫిట్టర్- 116
  2. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)- 34
  3. ఎలక్ట్రీషియన్- 138
  4. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(COPA)- 52
  5. సెక్రెటేరియల్ అసిస్టెంట్- 20
  6. పెయింటర్- 23
  7. కార్పెంటర్- 28
  8. ఏసీ మెకానిక్- 10
  9. మెషినిస్ట్- 10
  10. స్టెనోగ్రాఫర్ హిందీ- 3
  11. స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్- 3
  12. ఎలక్ట్రానిక్ మెకానిక్- 15
  13. కేబుల్ జాయింటర్- 2
  14. డీజిల్ మెకానిక్- 30
  15. మేసన్- 26
  16. బ్లాక్‌స్మిత్- 16
  17. సర్వేయర్- 8
  18. డ్రాఫ్ట్స్‌మన్ సివిల్- 10
  19. ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్- 12
  20. సెక్రెటేరియల్ అసిస్టెంట్ ఇంగ్లీష్- 4


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 15

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 15

విద్యార్హత- 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.

వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Railway Jobs: 570 jobs in Railways ..."