Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

sBI: Are currency notes corrupted? Change free in SBI Like this.

SBI: కరెన్సీ నోట్లు పాడయ్యాయా? SBIలో ఫ్రీగా మార్చుకోండి ఇలా.
sBI: Are currency notes corrupted? Change free in SBI Like this.

పాడయ్యాయా? పాత నోట్లు ఎక్కడా తీసుకోవట్లేదా? అయితే మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI బ్రాంచ్‌లో ఉచితంగా మార్చుకోవచ్చు. 
రూ.5000 లోపు విలువ ఉన్న 20 నోట్లను ఉచితంగానే ఎక్స్‌ఛేంజ్ చేయొచ్చు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ నోట్లను మార్చాలనుకుంటే సర్వీస్ ఛార్జీ చెల్లించాలి. గతేడాది అక్టోబర్‌లోనే ఈ సర్వీస్ ఛార్జీలను సవరించింది SBI. బ్యాంకు వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం 20 కరెన్సీ నోట్ల కన్నా ఎక్కువ మార్చాలనుకుంటే ప్రతీ నోటుకు రూ.2+జీఎస్‌టీ చెల్లించాలి. అంటే రూ.5,000 కన్నా ఎక్కువ విలువైన నోట్లు మారిస్తే ప్రతీ నోటుకు ఈ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI నోట్ రీఫండ్ రూల్స్‌నే SBI పాటిస్తుంది.

పాడైన, ముక్కలైన నోట్లను మాత్రమే బ్యాంకు ఎక్స్‌ఛేంజ్ చేస్తుంది. 

ఎక్కువగా ఉపయోగించడం వల్ల పాడైన నోట్లనే ఎక్స్‌ఛేంజ్ చేస్తుంది బ్యాంకు. ఒకవేళ నోటు రెండు ముక్కలైతే, ఆ నోటులోని అన్ని భాగాలను సరిగ్గా అతికించినా బ్యాంకు ఎక్స్‌ఛేంజ్ చేస్తుంది. అయితే మోసం చేసేందుకే నోట్లు పాడుచేసినట్టు అనుమానం వస్తే బ్యాంకు ఆ నోట్లను మార్చుకోదు. అంతేకాదు... కరెన్సీ నోటుపైన ఏదైనా రాజకీయ పార్టీకి చెందిన నినాదాలు రాస్తే ఆ నోట్లు చెల్లవు. అలాంటి నోట్లను ఎక్స్‌ఛేంజ్ లేదా రీఫండ్ సమయంలో తిరస్కరించే హక్కు బ్యాంకులకు ఉంటుంది. నోట్లను కావాలనే ముక్కలు చేయడం, చించేయడం, ఉద్దేశపూర్వకంగా పాడుచేయడం లాంటివి బ్యాంకు గుర్తిస్తే ఆ నోట్లను తీసుకోవు. అందుకే మీరు బ్యాంకులో పాడైపోయిన నోట్లు మార్చడానికి వెళ్లినప్పుడు ఇవన్నీ పరిశీలించండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "sBI: Are currency notes corrupted? Change free in SBI Like this."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0