Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Tajmahal

తాజ్‌మహల్ కాదది... తేజోమహాలయ్... ఆధారాలివే!
Tajmahal

ఆగ్రా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వస్తున్న సందర్భంగా ఆయన తాజ్‌మహల్ సందర్శిచనున్నారు. కాగా తాజ్‌మహల్ కట్టడం గురించి ఇప్పుడు మరో వివాదం నడుస్తోంది. మొన్నటి మహాశివరాత్రి రోజున కొందరు హిందూవాదులు తాజ్‌మహల్ వెనుకనున్న మహ్తాబ్ బాగ్ ప్రాంతంలో 'తేజోమహాలయ్ శివ్' ప్రతీకాత్మకరూపానికి జలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా వారు భారత్ -అమెరికాల మధ్య సత్సంబంధాలు నెలకొనాలని ప్రార్థించారు. తాజ్‌మహల్‌ను 'తేజోమహాలయ్' అని పిలవడం వెనుక ఒక కథనం ఉంది. వివరాల్లోకి వెళితే 1989లో ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఎ)లో పనిచేసిన అధికారి, స్వాతంత్ర్యానంతరం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖలో పనిచేసిన పురుషోత్తమ్ నాగేష్ తాను రాసిన 'తాజ్ మహల్ ఈజ్ ఏ టెంపుల్ ప్యాలెస్' అనే పుస్తకంలో తాజ్‌మహల్ గురించి ప్రస్తావించారు.
తాజ్‌మహల్ నిజానికి ఒక ప్రాచీన శివాలయం అని దానిలో రాశారు. దానిపేరు తేజోమహాలయ్ అని పేర్కొన్నారు. ఇంతేకాకుండా అది శివాలయం అని చెప్పేందుకు పలు తార్కాణాలు కూడా ఆ పుస్తకంలో చూపారు. తాజ్‌మహల్‌లోని సంగమ్‌రమర్ వద్ద 108 కలశాలు ఉన్నాయని, ఇవి హిందూ సంప్రదాయానికి ప్రతీకలని పేర్కొన్నారు. ఇదేవిధంగా తాజ్‌మహల్‌లో హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబించే పలు నిర్మాణాలు ఉన్నాయని పేర్కొన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Tajmahal"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0