Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

These are the benefits of eating Egg daily

కోడిగుడ్డు తినడం వల్ల కలిగే ఉపయోగాలెన్నో..
These are the benefits of eating Egg daily


గుడ్డు పౌష్టికాహారం. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఇందులో ఉంటాయి. పిల్లల పెరుగుదలకు ఇవి ఎంతో ఉపయోపడతాయి. కూరగా వాడుకోవడంతో పాటు, ఉడకబెట్టిన గుడ్డును తినడం వలన కంటి చూపుకు ఎంతో మేలు అని డాక్టర్లు చెబుతున్నారు. 

మరి రోజూ గుడ్డు తీసుకోవడం వల్ల మనం ఎటువంటి ప్రయోజనాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం..
1.రోజు గుడ్డు తినేవారికి శుక్లాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి.
2.గుడ్డు తినడం వల్ల తక్కువ క్యాలరీలతో తగిన శక్తిని ఇస్తుంది.
3.సాధారణ సైజు గుడ్డు 80 క్యాలరీల శక్తిని అందిస్తుంది. అందుకే డైటింగ్‌ చేసేవారు గుడ్డును ఆహారంగా తీసుకోవచ్చని వైద్యుల సూచన.
4.బరువును తగ్గించుకునేందుకు గుడ్డును ఉపయోగించడం ఎంతో ప్రయోజనకరం.
5.గుడ్డును తినడం వలన గుండె జబ్బులు పెరుగుతాయన్నది అపోహ మాత్రమేనని ఒక అధ్యాయనంలో తేలింది. వాస్తవానికి గుడ్డు తినేవారిలో రక్తనాళాలు మూసుకుపోవడం, లేదా గుండె జబ్బులు రావడం బాగా తక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
6.మెదడుకు ఆరోగ్యాన్నిచ్చే పోషకాలు గుడ్డులో పుష్కలంగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్న మాట. గుడ్డు సొనలో 300 మైక్రో గ్రాములు కోలిన్‌ అనే పోషక పదార్థం ఉంది. ఇది మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతంది. మెదడులో సమాచార రవాణాన్ని మెరుగుపరుస్తుంది. మెదడు నుంచి సంకేతాలు వేగంగా చేరవేయడంలో కూడా కోలిన్‌ పాత్ర పోషిస్తుంది.
7.గుడ్డులో ఉన్న ఐరన్‌ను శరీరం చాలా సులభంగా గ్రహిస్తుంది. అలా గ్రహించే రూపంలో ఐరన్‌ ఉన్నందున గుడ్డు గర్భిణులకు, బాలింతలకు ఎంతో మేలు చేస్తుంది.
8.గుడ్డును ఆహారంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌కు ఎటువంటి సంబంధం లేదు. ప్రతి రోజు రెండు కోడి గుడ్లు తీసుకునేవారికి లైపిడ్స్‌లో ఎటువంటి మార్పు లేకపోవడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. అంతే కాకుండా శరీరానికి మేలు చేసే కొలెస్ట్రాల్‌ పెరుగుతుందని తేలింది.
9.స్త్రీలలో రొమ్ము క్యాన్సర్‌ రాకుండా కాపాడే శక్తి గుడ్డుకుందని, వారంలో ఆరు రోజులు గుడ్డును ఆహారంగా స్త్రీలకు అందిస్తే 44 శాతం రొమ్ము క్యాన్సర్‌ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
10.గుడ్డులో అరుదైన లవణాలతోపాటు పాస్పరస్‌, అయోడిన్‌, సెలీనియం, ఐరన్‌, జింక్‌లు ఉంటాయి.
11.గుడ్డులోని ప్రొటీన్ల వల్ల యవ్వనంలోని కండరాలకు బలం, చక్కని రూపం ఏర్పడుతుంది.
12.విటమిన్‌ ఏ ఆరోగ్యకరమైన కణాల అభివృద్ధికి, చర్మం, కళ్లకు, వాటి కణజాలానికి ఇది ఎంతో అవసరం.
13. గుడ్డు తినడం వల్ల బి12 ఎర్ర రక్త కణాల తయారీకి, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి మెదడు, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది.
14.ఎముకలు, కీళ్లు, పళ్ల నిర్మాణానికి, శరీరానికి అవసరమైన కాల్షియంను గుడ్డు అందిస్తుంది.
15.గుడ్డును బాగా ఉడికించి, అందులోని బ్యాక్టీరియాను పూర్తిగా సంహరించబడేలా చూసుకోవాలి. 16.బాక్టీరియా వల్ల శరీరానికి నష్టం.పచ్చి గుడ్డును తినడం మంచిది కాదు.
17 తెల్లసొనలో ఎవిడిన్‌ అనే గ్లైకో ప్రొటీన్‌ ఉండటం వలన అది బి విటమిన్‌ను శరీరానికి అందనీయకుండా చేస్తుంది.
18.టైప్‌ 2 డయాబెటీస్‌ ఉన్నవారు గుడ్డును వాడరాదు. అనారోగ్య సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయని అధ్యాయనంలో వెల్లడైంది.
యాంటీబయాటిక్స్‌ మందులు సెఫలోస్పోరిన్స్‌ గుడ్డు వాడే వారిలో పనిచేకపోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "These are the benefits of eating Egg daily"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0