Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

y.S.Jagan decision ... Happy to farmers in AP.

వైఎస్ జగన్ నిర్ణయం... ఏపీలో రైతులకు హ్యాపీ.
y.S.Jagan decision ... Happy to farmers in AP.

ఆటో మ్యూటేషన్... ఇవో రకం సేవలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఈ సేవల్ని ప్రారంభించారు. ఐతే... దీనిపై ఎక్కవగా ప్రభుత్వం ప్రచారం చెయ్యలేదు. కానీ ఇవి చాలా కీలకమైన సేవలు. అందుకే ఇవేంటో తెలుసుకుంటే మంచిది. ఆటో మ్యూటేషన్ సేవలు... ఇకపై ఏపీలో రెవెన్యూ శాఖలో అమలవుతున్నాయి. ఇకపై భూ యాజమాన్య హక్కుల మార్పిడి (మ్యూటేషన్) చాలా ఈజీగా ఆటోమేటిక్‌గా జరిగిపోతుందన్నమాట. ఇప్పటివరకు రైతులు తమ భూముల్ని అమ్మాలన్నా, కొనాలన్నా... ఆ వివరాల్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి తహసీల్దారు ఆఫీస్, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇందుకు ఎక్కువ టైమ్ పట్టేది. అలాగే లంచాలు కూడా ఇచ్చుకోవాల్సి వచ్చేదన్న ఆరోపణలు ఉన్నాయి.
అదే కొత్త సేవల వల్ల రిజిస్ట్రేషన్ చేసిన భూముల వివరాలు... రెవెన్యూ రికార్డుల్లో వెంటనే మారిపోతాయి. ఇకపై భూ రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే... రెవెన్యూ రికార్డుల ఆన్‌లైన్ భూమి మార్పు కోసం ఎలాంటి డబ్బూ చల్లించక్కర్లేకుండా భూ రికార్డుల మార్పిడి నమూనా (ROR 1B) వివరాలు ఆన్‌లైన్‌లో రెవెన్యూ శాఖకు వెళ్తాయి. అలా అక్కడ అవి రికార్డై... ఆన్‌లైన్‌లో ఎక్కడి నుంచైనా చూసుకోవడానికి, చెక్ చేసుకోవడానికీ వీలవుతుంది.
కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఆటో మ్యూటేషన్ సేవల్ని విజయవంతంగా అమలు చేసింది. ఆ తర్వాత ఇవే సేవల్ని రాష్ట్రమంతా అమలుచేసింది. ఇకపై భూ రిజిస్ట్రేషన్ మొదలు, ఈ-పాస్‌బుక్ జారీ వరకు మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరిగిపోతుంది. అందువల్ల ఇకపై భూ పట్టాదారులు ఆన్‌లైన్ భూ మార్పుల (బదలాయింపు) కోసం తహశీల్దారు ఆఫీస్, మీ సేవా కేంద్రాలకు వెళ్లి ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేయించాల్సిన పనిలేదు. భూ బదలాయింపు ప్రక్రియ ప్రతి దశకు సంబంధించిన అప్‌డేట్స్... పట్టాదారు మొబైల్ నంబర్‌కి SMS ద్వారా అందుతుంది. 30 రోజుల్లో తహశీల్దార్ ధ్రువీకరణ, తర్వాత రెవెన్యూ రికార్డుల్లో ROR 1Bలో పర్మనెంట్‌గా నమోదవుతుంది. తద్వారా ఈ-పాస్‌బుక్ వెంటనే పొందడానికి వీలవుతుంది. ఈ ప్రక్రియ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నిర్వహించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "y.S.Jagan decision ... Happy to farmers in AP."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0