Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

6 places to get yourself off the internet in India.

ఇండియాలో మిమ్మల్ని ఇంటర్నెట్ నుంచి బయటపడేసే 6 ప్రదేశాలు.

ప్రస్తుత రోజుల్లో చేతిలో స్మార్ట్ ఫోన్ లేకుండా అడుగు బయట పెట్టలేని పరిస్థితి ఉంది. మనిషి జీవితంలో మొబైల్ ఫోన్ ఒక తప్పనిసరి అవసరంగా మారిపోయింది. ఇంటర్నెట్ అనుసంధానం ప్రతి చోటా విస్తరించడంతో పనుల్లో వేగం పెరగడంతో పాటు జీవితంలో ఎక్కువ సమయాన్ని దానికే కేటాయిస్తున్నారు. దాదాపు చాలా వరకూ పరిశ్రమల్లో పనులు కంప్యూటర్, ఇంటర్నెట్ తో ముడిపడి ఉండడంతో ల్యాప్ టాప్ ల వినియోగం కూడా బాగా పెరిగింది. దీంతో ఎక్కడకు వెళ్లినా చేతిలో స్మార్ట్ ఫోన్, బ్యాగులో ల్యాప్ టాప్ తప్పనిసరిగా మారిపోయింది. ఒక్కోసారి గజిబిజీ సిటీ లైఫ్ కు, పని ఒత్తిడికి నుంచి తప్పించుకునేందుకు ఎక్కడికైనా దూరంగా వెళ్లిరావాలని చాలా మంది కోరుకుంటారు. మనం ఎక్కడికి వెళ్లినా ఇంటర్నెట్ కనెక్షన్ మనల్ని వదలదు కాబట్టి ప్రతి నిమిషానికి ఒకసారి స్మార్ట్ ఫోన్ లో నోటిఫికేషన్లు పలకరిస్తూనే ఉంటాయి. డేటా ఖాళీ అయితే ఫ్రీ వైఫై కనెక్షన్లు ఆకర్షిస్తుంటాయి. కానీ ఇంటర్నెట్ దూరంగా మీరు గొప్ప సమయాన్ని గడిపి రావాలని నిజంగా కోరుకుంటే మాత్రం ఇండియాలో కొన్ని ఆసక్తికరమైన ప్రదేశాలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ ప్రదేశాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ లభించదు కాబట్టి మీ ఫోన్ ను కేవలం అందమైన ప్రదేశాలను చిత్రీకరించేందుకు మాత్రమే ఉపయోగిస్తారు. ఇంటర్నెట్ కు దూరంగా ఉండే ఈ ప్రదేశాలు మీ జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆ ప్రదేశాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

​డాకి, మేఘాలయ

మేఘాలయలో ఉన్న ఈ చిన్న సుందరమైన పట్టణం రొటీన్ లైఫ్ నుంచి మిమ్మల్ని బయట పడేస్తుంది. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు ఈ పట్టణానికి దగ్గరగా ఉండడం వలన భద్రత కారణాల దృష్ట్యా ఇక్కడ ఇంటర్నెట్ కనెక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది. డాకి నది యొక్క స్పష్టమైన జలాలకు పేరొందిన ఈ ప్రదేశం ఒత్తిడిని తొలగించి మీ మనసుకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఈ నదీ జలాలపై పడవ ప్రయాణం ఎంతో మనోహరంగా అనిపిస్తుంది.

​కల్ప, హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్ లోని కల్ప గ్రామం మీకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. భారతదేశంలో ఉన్న అత్యంత అందమైన గ్రామాల్లో ఇది ఒకటి. ఇక్కడ ఎలాంటి ఇంటర్నెట్, ఆధునిక ప్రపంచపు ఛాయలు మీకు కనిపించవు. ఈ ప్రదేశం షాంగ్రి లాకు దగ్గరగా ఉంటుంది. ఇక్కడ కూడా నగరాలకు భిన్నంగా ఎంతో ప్రత్యేకమైన జీవన శైలి కలిగిన ప్రజలు, సుందరమైన ప్రకృతి వాతావరణ దృశ్యాలు కనిపిస్తాయి.

​లాచెన్&లాచుంగ్, సిక్కిం

సిక్కింలో ప్రకృతి సౌందర్యంతో ఆకట్టుకునే రెండు అందమైన గ్రామాలు 'లాచెన్ & లాచుంగ్'. సాధారణంగా గురుడోమ్గ్మర్ సరస్సుకు వెళ్లే పర్యాటకులు మార్గ మధ్యంలో వీటిని సందర్శించి వెళుతుంటారు. విలక్షణమైన హిమాయల భూభాగంలో ఉన్న ఈ రెండు ప్రదేశాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ అస్సలు ఉండదు. వాస్తవానికి ఇక్కడ విద్యుత్ కోతలు అధికంగా ఉంటాయి. ఒక్కోసారి ఇవి 24 గంటల కంటే ఎక్కువ కూడా కావొచ్చు.

​జొంగు, సిక్కిం

ఒక అందమైన స్వర్గసీమలా కనిపించే సిక్కింలోని జొంగు ప్రాంతం అనేక జలపాతాలు, లోతైన అడవులు, ఆకర్షణీయమైన ప్రకృతి దృశ్యాలతో ఇంటర్నెట్ కనెక్టివిటీకి దూరంగా ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. మీరు నిజంగా రోజువారి జీవితానికి భిన్నంగా సమయాన్ని గడపాలనుకుంటే ఈ గ్రామం గొప్ప అనుభవాలను అందిస్తుంది. దీనికి సరిహద్దుగా కాంచెన్జొంగా జాతీయ పార్కు ఉంది. ఆసక్తికరమైన అన్వేషణకు కావాల్సిన అన్ని అవకాశాలను ఈ ప్రదేశం మీకు కల్పిస్తుంది.

​చట్పాల్, కాశ్మీర్

కాశ్మీర్ లోని అత్యంత ఆసక్తికరమైన ప్రదేశాల్లో చట్పాల్ ఒకటి. ఇక్కడ చాలా రోజులు విద్యుత్ ఉండదు. కాబట్టి ఇంటర్నెట్ కనెక్షన్ గురించి మీరు ఇక్కడ పూర్తిగా మర్చిపోవచ్చు. బిజీ లైఫ్ కు దూరంగా ఎక్కడికైనా వెళ్లి రావాలని మీరు భావిస్తే ఇది మీకు సరైన గమ్యస్థానం. చుట్టుపక్కల ఉండే పచ్చినభూములపై పర్వతారోహణలు, నదీ ప్రవాహాల వద్ద గంటల కొద్దీ సమయం గడుపుతూ హాయిగా ఇక్కడ ఆనందించవచ్చు.
​నుబ్రా వ్యాలీ, లడఖ్

లడఖ్ కు ఏడాది పొడవునా పర్యాటకుల తాకిడి ఉంటుంది. టూరిజం ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందింది. లేహ్ చుట్టూ ఉండే ప్రాంతాలు దాదాపు ఆకట్టుకునే ఇంటర్నెట్ కనెక్షన్ ను కలిగి ఉన్నాయి. కానీ మీరు ఇంటర్నెట్ కు దూరంగా ఉండే ఆహ్లాదభరిత ప్రదేశాల కోసం వెతుకుతున్నట్లయితే అందమైన నుబ్రా వ్యాలీ, అల్చి అనే చిన్న గ్రామం చక్కని ఎంపికలు అని చెప్పవచ్చు. ఆధునిక ప్రపంచానికి దూరంగా ఈ ప్రదేశాలు గొప్ప ఆకర్షణను కలిగి ఉంటాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "6 places to get yourself off the internet in India."

Post a comment