Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

A combination of good Twinning Schools

'మేలు కలయిక '

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో వినూత్న కార్యక్ర మానికి ఎస్ఎ శ్రీకారం చుట్టింది . ప్రభుత్వ , ప్రయివేటు , ఎయిడెడ్ పాఠశాలల్ని అనుసం ధాన0 చేస్తూ ' కలయిక ' కార్య క్రమాన్ని రూపొందించింది . విద్యార్థుల్లో పరస్పర జ్ఞానసము పార్టన , మేధోమథనం , భావ వ్యక్తీ కరణ పెంపొందించటానికి పాఠశాలల కలయిక ( ట్విన్నింగ్ స్కూల్స్ ఆలోచనకు రూప మిచ్చి ప్రత్యక్షీకరణ చేయ నుంది . గ్రామీణ ప్రాంత విద్యా ర్డులను నగర ప్రాంత పాఠశా లకు తీసుకెళ్లి అక్కడి విద్యార్థు లతో మమేకం చేయాలన్నది ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం . గురువార0 నుంచి ప్రారంభ మైన ఈ కార్యక్రమం ఐదు రోజులపాటు కొనసాగనుంది . 

 ట్విన్నింగ్ స్కూల్స్ కార్యక్ర మంలో జిల్లాలోని 876 ప్రాథమిక , ప్రాథమికోన్నత పాఠశాలల్ని ఎంపిక చేశారు . 488 పాఠశాలు చొప్పున రెండు గ్రూపులను ఏర్పాటు చేశారు . ప్రాథమిక స్థాయిలో 4 , 5 తరగతుల్లో , ప్రాథమికోన్నతిలో 6 , 7 తరగ తుల్లో ఏదో ఒక తరగతిని ఎంచు కునే అవకాశం కల్పించారు . ఎ గ్రూపు పాఠశాలల్లోని విద్యార్థులు బి గ్రూపులో పాఠశాలలకు వెళ్లి ఐదు రోజులుపాటు అక్కడి బోధన , విద్యా సంబంధ కార్యక్ర మాలు , క్రీడలు , మధ్యాహ్న భోజన పథకాన్ని అంచనా వేస్తారు . తరు వాత బీ గ్రూపులో పాఠశాలల విద్యార్థులు ఏ గ్రూపు పాఠశాల లకు వెళ్లి పరిస్థితిని అవగాహన " చేసుకుంటారు . ఒక పాఠశాల విద్యా దులకు రవాణా భత్యం కింద రోజుకు రూ . 200 వరకు ఖర్చు చేనే వెసులుబాటు కల్పించారు . ఒక్కో పాఠశాలకు వెయ్యి రూపా యల చొప్పున ఎమ్యీవో ఖాతాలకు ఎస్ఎస్ఏ జమ చేసింది . 
నిర్వహించాల్సిన అంశాలు . . . 
క్రీడలు , ఆర్ట్ , క్రాఫ్ట్ , జానపద సంగీతం , జీవన నైపుణ్యాలు , స్థానిక జీవనశైలి , వృత్తులు ( వ్యవ సాయం , పరిశ్రమలు , చేతివృ త్తులు ) , దర్శనీయ ప్రదేశాలు , పండుగల పరిశీలన .
ఆశిస్తున్న ప్రయోజనాలు . . . . 
జ్ఞానం , నైపుణ్యాలను పెంచుకో వటం , గొప్ప ఆలోచనలు , నూతన విధానాలు , సమున్నత అవకాశాలను కల్పించి విద్యార్థులను స్పూర్తిదాయ కంగా తీర్చిదిద్దడం వంటివి పర స్పరం రెండు పాఠశాలల్లోనూ జరు గుతాయి . విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే విధంగా విలువలు , నాణ్యత , నైపుణ్యాలు , సామర్థ్యాలు పెంపొందించటమే లక్ష్యంగా కృత్యాలు రూపొందిస్తారు . విలు వలు , సంస్కృతి , సంప్రదాయాలపై గౌరవం , క్రమశిక్షణ , జీవన నైపుణ్యా లపై అవగాహన కల్పిస్తారు .
విద్యార్థుల ఎంపికకు . . . 
విద్యార్థుల్లో ఉత్సాహం , ఆరోగ్యం , సంస్కారం , తెలివిగల వారిని ప్రోత్సహించాలి . వేరే పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బంది లేనివారిని తల్లిదండ్రుల్ని సంప్ర దించిన తరువాత ఎంపిక చేయాలి . ప్రతిభా పాటవాలతో పాటు నిర్దేశించిన విషయాలపై అవగాహన ఉన్న వారిని గుర్తించాలి . ఆర్థికంగా , సామా జికంగా , బడుగు , బలహీన , పేద విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాలి . క్రీడలు , సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభావంతు లను ప్రోత్సహించాలి . 

పాఠశాలల ఎంపికకు ప్రామాణికాలు ఇవే

గ్రామీణ , నగర ప్రాంతాల్లో మౌలిక వసతులు , తాగునీరు , మరుగుదొడ్లు , ఆధునిక వస తులు ( కంప్యూటర్ , డిజిటల్ తరగతి ) , బోధనోపకరణాలు , ఆట స్థలం , క్రీడా పరికరాలు , పచ్చదనం , శుభ్రత ఉన్న పాఠ శాలల్ని ఎంపిక చేయాలి . విజ యాలు , నూతన విధానాలు , బోధనలో నవ్యత , నాణ్యత , క్రీడలకు ప్రాముఖ్యత వంటి అంశాలను ప్రామాణికంగా తీసు కుంటారు . పాఠశాలల్లో బహు ముఖ పరిజ్ఞానం , నైపుణ్యం గల సిబ్బందిని ప్రోత్సహిం చాలి . అక్కడికి విద్యార్థులు వెళ్లేందుకు ప్రయాణ సౌకర్యం , ఉండేందుకు వసతి సౌకర్యాలు ఉండాలి .
భాగస్వామ్య పాఠశాలలో . . . 
జిల్లా , మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలి . జిల్లా ఎస్ఎస్ఏకు ఎస్పీడీ విడుదల చేసిన నిధులను కలె క్టర్ అనుమతితో మండలాలకు విడుదల చేస్తారు . ఏఎంవోకు పర్యవేక్షక బాధ్య తను అప్పగించారు . మండల స్థాయిలో ఎమ్యీవో , భాగస్వామ్య పాఠశాలల ప్రధా నోపాధ్యాయులు కార్యక్రమ నిర్వహ ణలో భాగస్వాములుగా ఉంటారు .
పరస్పరం జ్ఞానాభివృద్ధే లక్ష్యం 
పాఠశాలల ఉపాధ్యాయులు , విద్యార్ధులు పరస్పర కలయికతో ఈ కార్యక్రమాన్ని చేప ట్టాలి . సమాచారాన్ని , శాస్త్ర సాంకేతికను పంచుకోవటం , సహాయ సహకారాలతో ప్రాజెక్టులు నిర్వహించాలి . తోటి వారితో భాగస్వాములై పరస్పరం సహకరించుకుని జ్ఞాన సముపార్జన చేసుకోవాలన్నదే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం . - 

రెడ్రౌత్ శ్యాంసుందరరావు , ఎస్ఎస్ఏ ఏఎంవో , కృష్ణా

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "A combination of good Twinning Schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0