Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

About D.S.C


  • ' డిఎస్ సి సమస్య తీరేనా ?
  • నోటిఫికేషన్ కోసం ఎదురుచూపులు 
  • ఇంకా కోర్టులోనే 2018 నోటిఫికేషన్ కేసు 
  • సమస్య పరిష్కారానికి చొరవ చూపని ప్రభుత్వం 
  • రాష్ట్ర వ్యాప్తం గా 25 వేల పోస్టులు ఖాళీ

 About D.S.C


 రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఖాళీ అవుతున్న పోస్టులను భర్తీ చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది . కీలకమైన డిఎసి విషయంలో ఇది ప్రస్ఫుట0గా కనిపిస్తోంది . గత ప్రభుత్వంలో 2016 , 2018లో డిఎస్సీ నోటిఫికేషన్లు వెలువడ్డాయి . అయితే 2018 నోటిఫికేషన్‌పై తమకు అన్యాయ0 జరిగిందంటూ కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో ఆది ఆగిపోయింది . ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకూ నోటిఫికేషన్ ఇవ్వలేదు . అధికారంలోకి వస్తే ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తానని ప్రకటించిన సిఎం ఆ దిశగా చర్యలేమీ తీసుకోకపోగా కోర్టులో నడుస్తున్న 2018 నోటిఫికేషన్ కేసు సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలూ లేవు . 2016 డిఎస్సీలో 10 , 330 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి 8972 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు . మిగిలిన పోస్టులు ఖాళీగానే ఉంచారు . 2018లో 7 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు . అందులో 3900 సెకండ్ గ్రేడ్ టీచర్ ( ఎస్పీజీ ) పోస్టులకు సుమారు ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు . వీరికి ఆన్‌లైన్‌లో తొమ్మిది రోజులపాటు రోజుకు రెండు పేపర్ల చొప్పున విడతల వారీగా మల్టీ టైమ్ , మల్టీ పేపర్ పరీక్షలు నిర్వహించారు . అందులో పేపర్ సులువుగా వచ్చినవారు క్వాలి ఫై అయ్యారు . కష్టంగా వచ్చిన వారు క్వాలిఫై కాలేక , ఇది అన్యాయమంటూ కోర్టుకెళ్లారు . ఇలాంటి సమయాల్లో కష్టమైన పేపర్ వచ్చిన వారికి నార్మలైజేషన్ పద్ధతిలో మార్కుల్లో కొంత వెసులుబాటు కల్పిస్తారు . ఈ పద్ధతి ఆర్ ఆర్ బి , ఎస్ఎస్ సి , బ్యాంకు ఉద్యోగ నియామకాల్లో పాటిస్తారు . డిఎస్సీకి మాత్రం అమలు కావడం లేదు . దీన్ని అమలు చేయాలని కోర్టుకెళ్లడంతో క్వాలిఫై అయిన వారంతా సందిగ్ధంలో పడ్డారు . 
ఇంగ్లీషు మీడియంతో తిప్పలు
 ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 25 వేల పోస్టులు ఖాళీ ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ కార్యాలయాల నుండి ప్రభుత్వానికి సమాచారం అందింది . అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరమూ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పిన జగన్ ఇప్పటి వరకూ ఒక్క నోటిఫికేషనూ ఇవ్వలేదు . ఇదిలా ఉండగా , ప్రభుత్వం ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంతో ఇప్పటి వరకూ తెలుగులో ప్రిపేర్ అయిన వాళ్లు ఇప్పుడు ఎలా ప్రిపేర్ కావాలి , ఏ పుస్తకాలు చదవాలి , పరీక్షలు ఎలా ఉండబోతున్నాయనేది అర్ధంగాక ఆందోళన పడుతున్నారు . డిఎస్ సి శిక్షణ తీసుకునే అభ్యర్థులు ఇప్పటి వరకూ షార్ట్ టెర్మ్ కు రూ . 15 వేలు , ఫుల్టెర్మ్ కు రూ . 45 వేలు ఖర్చు చేసేవారు . ఇప్పుడు ఇంగ్లీషు మీడియం కావడంతో శిక్షణ ఫీజులు రెట్టింపు చేసే అవకాశం ఉందని ఆశావహులు చెబుతున్నారు . గతంలో బిఇడి అభ్యర్థులు ఎతైటీ పోస్టులకు అర్హులు కాదు . కానీ ప్రభుత్వం ఆ నియమానికి సడలింపు ఇవ్వడంతో పోటీ కూడా పెరిగింది .
 PET లూ అరకొరే . . . 
ప్రభుత్వం ప్రతి శనివారం నో బ్యాగ్ డేని ప్రవేశపెట్టింది . ఆ రోజు క్రీడలు , వ్యక్తిత్వ వికాసం క్లాసులు మాత్రమే చెప్తారు . దీనికి ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ ( పిఇటి ) ముఖ్యం . రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ప్రాధమిక పాఠశాలలు ఉన్నాయి . వీటిలో 20 శాతం పాఠశాలల్లో మాత్రమే పిఇటిలు ఉన్నారు . గత నోటిఫికేషన్ విడుదల సమయంలో 1500 పోస్టులు ఖాళీ ఉండగా 173 పోస్టులకు మాత్రమే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది . దీంతో పిఇటి అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో 400 పోస్టులకు పెంచింది . అయితే ఎతైటీ పోస్టులను కుదించడం కొసమెరుపు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " About D.S.C "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0