Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP CM cabinet decisions

AP CM జగన్ కేబినెట్ నిర్ణయాలు
ఏపీ కేబినెట్‌ ప్రత్యేక సమావేశం ముఖ్యాంశాలు

  • ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర కేబినెట్‌ ప్రత్యేకంగా సమావేశం జరిగింది. 
  • కరోనా వ్యాప్తి నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించలేని పరిస్థితి నెలకొన్నందున్న ఈ ప్రత్యేక కేబినెట్‌ సమావేశంలో బడ్జెట్‌పై  ఆర్డినెన్స్‌ ను ఆమోదించారు. 
  • ఈ భేటీలో సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. అలాగే రాష్ట్రంలో కరోనా కట్టడికి మరిన్ని నిర్ణయాలు, ప్రజలకు అందించే సేవలపై చర్చించారు. 
  • అందుకోసం కేబినెట్‌ హాల్‌లో కాకుండా కాన్ఫరెన్స్‌ హాలులో ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
  • సీఎం జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు అందులోని ముఖ్యాంశాలు ...
  • బడ్జెట్‌ ఆర్డినెన్స్‌ కు ఏపీ కేబినెట్‌ ఆమోదం
  • వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21లో 3 నెలలకు సంబంధించిన బడ్జెట్‌ ఆర్డినెన్స్‌ కు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు.
  • ప్రతి జిల్లా కలెక్టర్‌ వద్ద రూ.2కోట్ల అత్యవసర నిధి ఏర్పాటు.
  • రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.  
  • దాదాపు 28వేల మంది విదేశీయులు రాష్ట్రానికి వచ్చారు.
  • 104 హెల్ప్‌లైన్‌ నెంబరు ఏర్పాటు చేశాం... 24గంటలు పనిచేస్తుంది.
  • కరోనా బాధితుల కోసం ఇప్పటికే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఐసోలేటెడ్‌ బెడ్స్‌ ఏర్పాటు చేశాం.
  • జిల్లా స్థాయిలో 200 పడకల ఆసుపత్రిని సిద్దంగా ఉంచాం. కరోనా వ్యాపించకుండా స్వీయనింత్రణ విధించుకున్నాం.
  • విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, నెల్లూరులోని ఆసుపత్రుల్లో కరోనా వైరస్‌ రోగులకు చికిత్స అందిస్తున్నాం.
  • 52వేల ఎన్‌-95 మాస్క్‌ లు, 4వేల పీపీఈలు, 400 వెంటిలేటర్లు, 10లక్షల సర్జికల్‌ మాస్క్‌ లు అందుబాటులో ఉన్నాయి’’ అని మంత్రి వివరించారు.
  • ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని కోరారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP CM cabinet decisions"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0