Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Breaking down the lock on the corona is a huge value Fully locked 548 districts nationwide

కరోనా పై లాక్ డౌన్ అస్త్రం ఉల్లంఘిస్తే భారీ మూల్యం
దేశవ్యాప్తంగా 548 జిల్లాలు పూర్తిగా లాక్
Breaking down the lock on the corona is a huge value  Fully locked 548 districts nationwide

తిరువనంతపురం...
కేరళ రాజధాని తిరువనంతపురంలో రహదారులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ నెల 31 వరకు రాష్ట్రం మొత్తం లాక్​డౌన్​ విధిస్తున్నట్లు సీఎం పినరయి విజయన్​ నిన్న ప్రకటించారు. 
గుజరాత్​లో నిర్బంధం...
గుజరాత్​లో లాక్​డౌన్​ కొనసాగుతోంది. ప్రజలు చాలా చోట్ల స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమయ్యారు. అహ్మదాబాద్​లో రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 
షహీన్​బాగ్​ ఖాళీ...
కరోనా వైరస్ నియంత్రణ నేపథ్యంలో దిల్లీ షహీన్​బాగ్​లో నిరసనలు చేపడుతోన్న ఆందోళనకారులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు పోలీసులు. పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. 

భద్రత కట్టుదిట్టం...

దిల్లీ షహీన్​బాగ్​ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. దిల్లీలో 144 సెక్షన్​ విధించిన దృష్ట్యా నిరసనలు చేపట్టకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు.
డౌన్​లాక్​డౌన్​...
కరోనా వ్యాప్తిని నియంత్రించే క్రమంలో దేశంలోని 30 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 548 జిల్లాల్లో పూర్తిగా లాక్​డౌన్​ విధించారు. ఈ మేరకు కేంద్రం కీలక నిర్ణయం వెలువరించింది.ఆదివారం వరకు దేశంలోని 80 జిల్లాల్లోనే లాక్​డౌన్​ విధించగా ఆ జాబితాను విస్తరించింది ప్రభుత్వం. భారత్​లో మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలుండగా 23 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో పూర్తి దిగ్బంధం ప్రకటించింది. మధ్యప్రదేశ్​, ఉత్తర్​ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని 58 జిల్లాల్లో మాత్రమే లాక్​డౌన్​ విధించారు. మరో కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్​​లో పాక్షికంగా సేవలు నిలిపి వేశారు. సిక్కిం, మిజోరం రాష్ట్రాల్లో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Breaking down the lock on the corona is a huge value Fully locked 548 districts nationwide"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0