Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

central government corona package: Direct payments into accounts

కేంద్రం కరోనా ప్యాకేజ్: నేరుగా అకౌంట్లలోకి డబ్బులు
central government corona package: Direct payments into accounts

కరోనా కోరల్లో చిక్కున్న భారత్ ఆర్థిక రంగానికి ఊతం ఇచ్చేలా ప్రకటన చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు. అలాగే జన్ ధాన్ ఖాతాల్లోకి డబ్బులు నేరుగా జమ చేస్తామని వెల్లడించారు.

లక్షా 70వేల కోట్ల ప్యాకేజీ రెడీ చేయగా.. ఎకనామిక్ రిలీఫ్ ప్యాకేజీలో భాగంగా.. దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించవద్దని.. అలాగే ఎవరి చేతిలోనూ డబ్బు లేని పరిస్థితి ఉండవద్దని ప్రభుత్వం భావిస్తోందని ఆమె అన్నారు. అందులో భాగంగానే ఈ ప్యాకేజీతో పేదల ఆకలి తీర్చడంతో పాటు వారి ఖాతాల్లో ప్రత్యక్షంగా కొంత డబ్బును జమ చేస్తామని చెప్పారు.

కిసాన్ సమ్మాన్ నిధి హామిలో భాగంగా..
మొదటి వాయిదాగా రూ.2వేలను రైతుల ఖాతాల్లో వేయనున్నట్టు తెలిపారు. ఈ పథకం కింద మొత్తం 8.69కోట్ల రైతులు లబ్ది పొందుతారు. అలాగే సంఘటిత కార్మికులు.. కూలీ, నాలి చేసుకొనే వారు, కార్మికులు, నిరుద్యోగులు.. ఇలా ప్రతొక్కరిపై కరోనా ప్రభావం చూపుతుండగా.. రైతులకు.. వితంతువులకు, పెన్షనర్లు, దివ్యాంగులు.. జన్ ధన్ యోజన ఖాతాధారులకు.. ఉజ్వల స్కీమ్... నేషనల్ రూరల్.. ప్రతి ఒక్కరికి నగదు ఇచ్చేందుకు కేంద్రం ప్రణాళికలు వేసింది.

 రైతులు: ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రూ .2,000 ఏప్రిల్ మొదటి వారంలో ఇచ్చేందుకు నిర్ణయించింది. 8.69 కోట్ల మంది రైతులకు వెంటనే ప్రయోజనం లభిస్తుంది.

 ఎంఎన్‌ఆర్‌ఇజీఎ(Mahatma Gandhi National Rural Employment Guarantee Act): వేతన రేటును రూ .182 నుంచి రూ .202 కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ఒక్కో కార్మికునికి రూ .2000 పెరగనుంది. దీని వల్ల 5 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుంది.

వృద్ధులు/ వితంతువులు: వృద్దులు,దివ్యాంగులకు ప్రతీ నెలా ఎక్స్‌గ్రేషియా కింద రూ.1000 చెల్లించనున్నారు. దీనివల్ల 3 కోట్ల మంది వితంతువులు, సీనియర్ సిటిజన్లు ప్రయోజనం పొందుతారు.

మహిళా జన ధన్ అకౌంట్స్: జన్‌ధన్ ఖాతాలను కలిగిన మహిళలకు ప్రతీ నెలా వారి ఖాతాలో రూ.500 చొప్పున వచ్చే మూడు నెలల పాటు జమ చేయనున్నారు. దీనివల్ల 20 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం ఉంటుంది.

మహిళా ఉజ్జవాలా షీమ్ లబ్ధిదారులు: మూడు నెలలు పాటు ఉచిత సిలిండర్లు. దీని వల్ల 8.3 కోట్ల బిపిఎల్ కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది.

 మహిళల స్వయం సహాయక బృందాలు: దీన్ దయాల్ జాతీయ జీవనోపాధి మిషన్ కింద స్వయం సహాయక బృందాలకు రుణపరిమితి రూ.10లక్షలకు పెంపు. ఎలాంటి పూచీకత్తు లేని రుణాలు అందజేస్తాం. దీని ద్వారా 63 లక్షల స్వయం సహాయక బృందాలకు లబ్ధి. దేశ వ్యాప్తంగా 20 కోట్ల మంది మహిళలకు మేలు జరుగుతుంది.

 వ్యవస్థీకృత రంగం: రాబోయే మూడు నెలలకు భారత ప్రభుత్వం యజమాని మరియు ఉద్యోగి ఇద్దరికీ కలిపి ఈపీఎఫ్ సహకారాన్ని చెల్లిస్తుంది. ఇది 100 మంది ఉద్యోగులతో ఉన్న సంస్థలకు రూ.15వేల లోపు జీతం ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్‌ చందా కేంద్రమే భరిస్తుంది. ఉద్యోగి వాటా 12శాతం, యజమాని వాటా 9శాతం కలిపి ఉద్యోగుల ఈపీఎఫ్‌ ఖాతాల్లో ప్రభుత్వమే జమ చేస్తుంది.

భవన నిర్మాణ కార్మికులు: లాక్డౌన్ కారణంగా ఆర్థిక విఘాతం ఎదుర్కొంటున్న వారికి సహాయం చేయడానికి సుమారు రూ .31,000 కోట్లు ఉన్న భవనం మరియు నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ నిధిని ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వబడ్డాయి.

 పరీక్షా కార్యకలాపాలు, మెడికల్ స్క్రీనింగ్, కరోనావైరస్ మహమ్మారిపై పోరాడటానికి అవసరమైన ఆరోగ్య దృష్టిని అందించడానికి జిల్లా నిధులను ఉపయోగించుకునేలా ఆదేశాలు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "central government corona package: Direct payments into accounts"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0