Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

CM Jagan Mohan Reddy unveils 'surveillance app' to prevent election irregularities

Andhra Pradesh : ఎన్నికల్లో అక్రమాల అడ్డుకట్టకు ' నిఘా ' యాప్ ఆవిష్కరించిన సీఎం జగన్.
CM Jagan Mohan Reddy unveils 'surveillance app' to prevent election irregularities

Andhra Pradesh Elections Nigha App | ఆంధ్రప్రదేశ్ లో మార్చి చివరి వరకు ఎన్నికల హడావుడి ఉంటుంది . ఈ ఎన్నికల్లో అక్రమాలకు బ్రేక్ వేసేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త యాప్ రూపొందించింది .

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల సందడి మార్చి 29 వరకు ఉంటుంది. ఈ ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకునేందుకు పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేకంగా ఓ యాప్ రూపొందించింది. 'నిఘా' పేరుతో తయారు చేసిన యాప్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిలోని క్యాంప్ ఆఫీస్‌లో ఆవిష్కరించారు. ఎన్నికల్లో డబ్బు, ఆల్కహాల్ పంపకాలను అడ్డుకోవడం, ఎన్నికల అక్రమాలపై సామాన్యుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడమే ఈ యాప్ లక్ష్యం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తయారు చేసిన నిఘా యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలను గుర్తించే ప్రజలు నేరుగా యాప్‌లో కంప్లైట్ చేయొచ్చు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు, మద్యం, గిఫ్ట్స్ లాంటివి ఇచ్చినా, ఇంటి ఓనర్ అనుమతి లేకుండా పోస్టుర్లు, బ్యానర్స్ అతికించినా, ఆయుధాలతో తిరుగుతున్నా యాప్‌లో కంప్లైంట్ ఇవ్వొచ్చు. ఫోటోలు, వీడియోలు తీసి అప్‌లోడ్ చేయొచ్చు. కంప్లైంట్‌తో పాటు జీపీఎస్ ద్వారా మీ లొకేషన్ ఎన్నికల అధికారులకు వెళ్తుంది. ఆ తర్వాత అధికారులు చర్యలు ప్రారంభిస్తారు. మీ కంప్లైంట్ స్టేటస్‌ని కూడా యాప్‌లో తెలుసుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "CM Jagan Mohan Reddy unveils 'surveillance app' to prevent election irregularities"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0