Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Corona Effect. . The Central Government is a key decision on government offices.

కరోనా ఎఫెక్ట్ . . ప్రభుత్వ కార్యాలయాలపై కేంద్రం కీలక నిర్ణయం.
Corona Effect. . The Central Government is a key decision on government offices.

ప్రభుత్వ కార్యాలయాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది . అన్ని కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన ఆంక్షలు విధించాలని అధికారులను ఆదేశించింది .

  • కరోనా వైరస్ ప్రభావంతో మనదేశం కూడా స్తంభించిపోయింది. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. షాపింగ్ మాల్స్, బార్లు, జిమ్‌లు వంటి ఎక్కువ మంది గుమిగూడే ప్రాంతాలన్నీ మూతపడ్డాయి. పెళ్లిళ్లు, ప్రభుత్వ కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. కరోనా బారిన పడకుండా ప్రజలను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇక పలు ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇచ్చాయి. ఐతే ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం యథావిధిగా పనిచేస్తున్నాయి. ఉద్యోగులకు సెలవులు ఇవ్వలేని పరిస్థితి. అలాగని ప్రైవేట్ మాదిరి వర్క్ ఫ్రమ్ హోయ్ చేయదగినిది కాదు. ఈ క్రమంలోనే ప్రభుత్వ కార్యాలయాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన ఆంక్షలు విధించాలని అధికారులను ఆదేశించింది.

  • 1. ప్రతి ప్రభుత్వ కార్యాలయం ప్రవేశం వద్ద స్కానర్లు, హ్యాండ్ శానిటైజర్లు ఏర్పాటు చేయాలి.
  • 2. సాధారణ విజిటర్స్ పాసులు రద్దు. అధికారులు అనుమతిస్తే విజిటర్‌ను లోపలికి పంపించాలి.
  • 3. సమావేశాలు రద్దు చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే సమీక్ష చేసుకోవాలి.
  • 4. అత్యవసవరమైతే తప్ప ఇతర ప్రాంతాలకు ఉద్యోగులు వెళ్లకూడదు.
  • 5. పైళ్లు, డాక్యుమెంట్లను ఇతర కార్యాలయాలకు వీలైనంత వరకు పంపించకపోవడం మంచింది. ఈమెయిల్స్ రూపంలోనే పంపించుకోవాలి.
  • 6. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న జిమ్‌లను మూసివేయాలి.
  • 7. ఉద్యోగులు కూర్చునే క్యాబిన్స్, కార్యాలయాల ఆవరణాలను నిత్యం శుభ్రం చేయాలి.
  • 8. ప్రతి కార్యాలయంలో హ్యాండ్ శానిటైజర్, సబ్బులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలి.
  • 9. దగ్గు, జలుబు, జ్వరం ఉంటే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి.
  • 10. ఎవరైనా వ్యాధి లక్షణాలతో క్వారంటైన్ కోసం సెలవు అడిగే అధికారులు మంజూరు చేయాలి.
  • 11. వృద్ధాప్యంలో ఉన్న ఉద్యోగులు, గర్భంతో ఉన్న మహిళా ఉద్యోగులు ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త వహించాలి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Corona Effect. . The Central Government is a key decision on government offices."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0