Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

coronavirus | India should lead the world. . WHO Key Comments

Coronavirus | ప్రపంచానికి ఇండియా దారి చూపాలి . . WHO కీలక వ్యాఖ్యలు 

ప్రపంచాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) కీలక వ్యాఖ్యలు చేసింది . ప్రపంచానికి దారి చూపాల్సింది ఇండియానేనని వ్యాఖ్యానించింది .

ప్రపంచాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచానికి దారి చూపాల్సింది ఇండియానేనని వ్యాఖ్యానించింది. 

కరోనాపై మీడియా సమావేశం నిర్వహించిన డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్.. కరోనా వైరస్ లాంటి మహమ్మారిని ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉందని ఆయన అన్నారు

గతంలోనూ ఇలాంటి మహా విపత్కర పరిస్థితుల నుంచి భారత్ బయటపడిందని చెప్పారు. మశూచి, పోలియో సోకిన సమయంలో భారత్ చూపించిన తెగువను గుర్తు చేసిన ఆయన.. కరోనాను జయిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. భారత్‌లో జనాభా ఎక్కువ అని, జనసాంద్రత కూడా ఎక్కువేనని.. అయినా మశూచి, పోలియో నివారణలో భారత్ విజయం సాధించిందని ర్యాన్ కొనియాడారు.

కరోనా నుంచి బయటపడేందుకు ప్రస్తుతం ఉన్నదల్లా వ్యక్తిగత పరిశుభ్రతేనని.. సులభతరమైన ఉపాయాలు ఏవీ లేవని అన్నారు. అంతేకాదు.. ఇండియా లాంటి దేశాలే ఓ మార్గాన్ని చూపాల్సిన తరుణం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. కాగా, లాక్‌డౌన్, కర్ఫ్యూ వల్ల కరోనా వ్యాప్తిని అడ్డుకోలేమని.. మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందని ఆయన స్పష్టం చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "coronavirus | India should lead the world. . WHO Key Comments"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0