Discontinued phone pay services
ఆగిపోయిన ఫోన్ పే సేవలు
ప్రముఖ ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ యాప్ ఫోన్ పే ఆగిపోయింది. ఫోన్ పే నుండి ఎలాంటి నగదు చెల్లింపులు జరగటం లేదు. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో వినియోగదారులకు సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
గురువారం రాత్రి యెస్ బ్యాంకుపై మారటోరియం విధిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. యెస్ బ్యాంకు బోర్డును రద్దు చేయటంతో పాటు, ఖాతాదారులకు నెలకు 50వేలు మాత్రమే నగదు ఉపసంహరణకు వీలు కల్పించింది. దీంతో ఖాతాదారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
మరోవైపు యెస్ బ్యాంకు షేర్లు భారీగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గత ఏడాది ఈ సమయానికి 280రూపాయలకు పైగా ఉన్న యెస్ బ్యాంకు షేర్ ధర ప్రస్తుతం 10రూపాలయ కనిష్టానికి పడిపోయింది.
ఈ విలువ మరింత పడిపోయి. కేవలం 1 రూపాయికే చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
అయితే. ఫోన్ పే సేవలన్నీ యెస్ బ్యాంకు నిర్వహిస్తూ ఉంటుంది. ప్రస్తుతం యెస్ బ్యాంకు సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో. ఫోన్ పే కూడా పనిచేయటం లేదు. యెస్ బ్యాంకుతో సంబంధం ఉన్న ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సేవలన్నీ ప్రస్తుతం అందుబాటులో లేవు.
0 Response to "Discontinued phone pay services"
Post a Comment