Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Due to Corona: Election of local bodies in Andhra Pradesh postponed

కరోనా దెబ్బ: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా.
Due to Corona: Election of local bodies in Andhra Pradesh postponed

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. ఈ మేరకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్వయంగా ఈ విషయాన్నీ వెల్లడించారు. ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.
కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఎన్నికల సంఘం చెప్పింది. దానితోపాటు హింసాత్మక సంఘటనలు కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.
రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా రక్షణ చర్యలను చేపట్టాలని... ఎవరినైనా భయభ్రాంతులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
ఈ ఎన్నికలు కేవలం వాయిదానేనని, ఇప్పటికే ఏకగ్రీవమైన స్థానాలకు సంబంధించిన వారు తదుపరి ఎన్నికైనవారితో కలిపి బాధ్యతలను స్వీకరిస్తారని తెలిపింది. 
కరోనా మహమ్మారి విజృంభిస్తుందని, ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నారని, తెలంగాణలో 31 వరకు షట్ డౌన్ పాటిస్తున్నారని, ఇలాంటి వేళ ఎన్నికలను వాయిదా వేయడమే మార్గమని భావించి ఎన్నికల సంఘం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు.

అత్యున్నత స్థాయిలో సమావేశాలు, సంప్రదింపులు జరిపిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఎన్నికల కోసం చాలా వరకు ఏర్పాట్లు పూర్తయ్యాయని అయినా గత్యంతరం లేకనే ఈ వాయిదా వేస్తున్నట్టు అన్నారు.
ఈ ఆరు వారాలపాటు కూడా ఎన్నికల నియమావళి ప్రకారంగా ఉండే నిషేధాజ్ఞలు అమలవుతాయని ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. ప్రభుత్వం ప్రజలను ప్రలోభ పెట్టె పథకాలు మినహా మిగిలిన దైనందిన కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చునని తెలిపింది.
గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా ఆరోపణలు వస్తున్నాయని, అధికార యంత్రంగం ఎట్టి పరిస్థితుల్లోనూ పక్షపాత వైఖరిని తీసుకోరాదని, అటువంటి వాటికి ఆస్కారమే లేదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ప్రజా ఆరోగ్యం దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. ఈ ఆరు వారాలు పూర్తయిన తరువాత సమీక్షా సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణను ప్రాకటిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఈ వాయిదా వేసిన కాలంలో అభ్యర్థులకు, వారి మద్దతుదారులకు అందరికీ రక్షణ కల్పించాలని పోలీసు శాఖను ఆదేశించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Due to Corona: Election of local bodies in Andhra Pradesh postponed"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0