Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

For the second consecutive year, the price of LPG cylinder has come down.

ఎల్‌పీజీ సిలిండ‌ర్ వినియోగ‌దారుల‌కు ఊర‌ట.. వరుసగా రెండోసారి భారీగా తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ ధర
For the second consecutive year, the price of LPG cylinder has come down.

ఎల్‌పీజీ సిలెండ‌ర్ (14.5కేజీలు) వినియోగ‌దారుల‌కు ఊర‌ట క‌లిగించే వార్త ఇది. వ‌రుస‌గా రెండో నెల‌లోనూ సిలెండ‌ర్ ధ‌ర‌లు త‌గ్గాయి. ఈ మేర‌కు ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఐవోసీ) బుధ‌వారం స‌వ‌రించిన ధ‌ర‌ల‌ను ప్ర‌క‌టించింది. అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు త‌గ్గిన కార‌ణంగా ఈ నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు తెలిపింది. మార్చి నెల‌లోనూ రూ.54/- త‌గ్గిన సంగ‌తి తెలిసిందే.  అయితే ఫిబ్ర‌వ‌రి నెల‌లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌లు పూర్త‌యిన త‌ర్వాత‌ ఒకేసారి రూ.145/-  పెంచిన సంగ‌తి తెలిసిందే. స‌వ‌రించిన ధ‌ర‌లు ఈరోజు నుంచి అమ‌లులోకి వ‌స్తాయి. స‌బ్సిడీలేని 14.2కేజీల ఎల్‌పీజీ సిలెండ‌ర్‌పై రూ.63/- త‌గ్గ‌నుంది.   ప్ర‌ధాన న‌గ‌రాల్లో నేటినుంచి అమ‌ల‌వుతున్న‌ ధ‌రలు... ఢిల్లీ న‌గ‌రంలో 744/- (61.5/- త‌గ్గింపు), కోల్‌క‌త్తాలో 774.5/- (65/- త‌గ్గింపు), ముంబ‌యిలో 714.5/-(62/- త‌గ్గింపు), చెన్నైలో 761.5/- (64.5/- త‌గ్గింపు)

అయితే, గృహ‌వినియోగ‌దారులకు అందుబాటులో ఉండే 12కేజీల స‌బ్సిడీపై సిలెండ‌ర్ల‌ బుకింగ్స్ పెద్ద ఎత్తున జ‌రుగుతున్నాయి.
లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఇళ్ల‌కే పరిమిత‌మ‌వ‌డం కార‌ణంగా వినియోగం గ‌ణ‌నీయంగా పెరిగింది. అంతేకాక, ఆందోళ‌న‌తో జ‌రుపుతున్న బుకింగ్‌లు కూడా ఓ కార‌ణ‌మే. ఈ కార‌ణంగా బుకింగ్ చేసుకున్న వినియోగ‌దారుల‌కు డెలివ‌రీ చేయ‌డంలో కొంత జాప్యం నెల‌కొంటుంద‌ని, బుకింగ్ చేసుకునేందుకు నిర్ణ‌యించిన గ‌డువులో కూడా మార్పులు చేస్తున్నామ‌నీ ఆయా సంస్థ‌లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "For the second consecutive year, the price of LPG cylinder has come down."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0