Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good news for government employees ... The decision to increase gratuity ...

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్...గ్రాట్యుటీ భారీగా పెంచుతూ నిర్ణయం...
Good news for government employees ... The decision to increase gratuity ...

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 2020 సంవత్సరానికి గ్రాట్యుటీ భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది అందరికీ వర్తించదు అని గ్రహించాలి కేవలం కొందరికి మాత్రమే వర్తిస్తుంది.
నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్) ఉద్యోగులకు మోదీ సర్కార్ తాజాగా తీపికబురు చెప్పింది. ఇందులో భాగంగా రెండు కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంది. కాగా నవోదయ విద్యాలయ సమితి అనేది మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్తి సంస్థ.
కేంద్ర ప్రభుత్వం తాజాగా నవోదయ విద్యాలయ సమితి ఉద్యోగుల గ్రాట్యుటీని రెట్టింపు చేస్తూ ఒకేసారి భారీగా పెంచింది. ప్రస్తుతం ఎన్‌వీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ పరిమితి రూ.10 లక్షలుగా ఉంది.
అయితే కేంద్రం తాజాగా ఈ పరిమితిని రూ.20 లక్షలకు పెంచేసింది.
ఉద్యోగులకు ఇది మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. కేంద్రం గ్రాట్యుటీ పెంపునకు సంబంధించి ఫిబ్రవరి 24న ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. కాగా గ్రాట్యుటీ పెంపు నిర్ణయం 2018 నుంచే అమలులోకి వస్తుందని కేంద్రం తెలిపింది. 2004 జనవరి 1కి ముందు ఉద్యోగంలో చేరిన వారికే మాత్రమే ఇది వర్తిస్తుంది అని స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం కూడా తీసుకుంది. ఎన్‌విఎస్ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ రూల్స్ 2007ను రద్దు చేసింది. దీంతో 2004 జనవరి 1కి ముందు ఉద్యోగంలో చేరిన వారికి పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 రూల్స్ వర్తిస్తాయి.
ఇకపోతే స్టాట్యుటరీ కార్పొరేషన్స్ ఉద్యోగులకు మినహా ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తీసుకునే గ్రాట్యుటీకి పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మినహా గ్రాట్యుటీ చట్టం 1972 పరిధిలోకి వచ్చే ఇతర ఉద్యోగులకు డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీపై రూ.20 లక్షల వరకు షరతులకులోబడి పన్ను మినహాయింపు ఉంటుంది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలోనే ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 10 (10) (3) ప్రకారం గ్రాట్యుటీ మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపును రూ.20 లక్షలకు పెంచింది. ఉద్యోగి సామర్థ్యం, ఇతర ఆర్థిక అంశాల ప్రాతిపదికన గ్రాట్యుటీ మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పెంచుతూ వస్తుంది. ఇకపోతే మోదీ సర్కార్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఎన్‌వీఎస్ ఉద్యోగులకు గొప్ప ప్రయోజనం కలుగనుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good news for government employees ... The decision to increase gratuity ..."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0