Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

GoodNews: Notification for 5 thousand Anganwadi posts soon!

గుడ్‌న్యూస్: త్వరలో 5వేల అంగన్‌వాడీ పోస్టులకు నోటిఫికేషన్!
GoodNews: Notification for 5 thousand Anganwadi posts soon!

ఏపీ ప్రజలకు మరో శుభవార్తనందించింది కేంద్రప్రభుత్వం. నిరుద్యోగ సమస్యను రూపుమాపాలనే లక్ష్యంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు, స్కీంలను ప్రవేశపెట్టింది. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అర్హులైన వారందరికీ ఉద్యోగాలు కల్పిస్తోంది. తాజాగా మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో చేసిన ప్రకటన రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరింత ఊరటనిస్తోంది.

2019 డిసెంబర్‌ 31 నాటికి ఏపీలో 1665 అంగన్‌వాడీ వర్కర్లు, 3347 అంగన్‌వాడి హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రకటించారు. కేంద్రప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతూ ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు.
అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల ఖాళీలను జిల్లా కలెక్టర్లు భర్తీ చేయడానికి వీలుగా తగిన ఆదేశాలు ఇవ్వవలసిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

ఇప్పటికే అంగన్‌వాడీ వర్కర్ల గౌరవ వేతనాన్ని నెలకు 3 వేల నుంచి 4 వేల రూపాయలకు, హెల్పర్ల గౌరవ వేతనాన్ని నెలకు 1500 నుంచి 2250 రూపాయలకు పెంచినట్లు మంత్రి తెలిపారు. అలాగే పనితీరు ప్రాతిపదికన హెల్పర్లకు ప్రోత్సాహకం కింద నెలకు 250 రూపాయలు చెల్లించడం జరుగుతోందన్నారు. ఐసీడీఎస్‌-సీఏఎస్‌ వినియోగించే అంగన్‌వాడీ వర్కర్లకు పోషణ్‌ అభియాన్‌ ప్రోత్సాహకం కింద నెలకు 500 రూపాయలు చెల్లిస్తున్నట్లు స్పష్టం చేశారు. . కేంద్రం ఇచ్చే గౌరవ వేతనానికి అదనంగా అనేక రాష్ట్రాలు తమ సొంత వనరుల నుంచి అంగన్‌వాడీలకు అదనంగా ప్రోత్సాహక నగదును చెల్లిస్తున్నాయన్నారు. ఇవి కాకుండా అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సౌకర్యాలను ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఈ క్రమంలోనే త్వరలో ఏపీలో అంగన్‌వాడీ నియమాకాలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "GoodNews: Notification for 5 thousand Anganwadi posts soon!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0