Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Health benefits of eating chapati.

రాత్రి చపాతీ తినటం వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు.


గోధుమలు శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటాయి. వీటి నుండి తయారు చేసిన చపాతీ వలన ఆరోగ్యం పెంపొందించటమే కాకుండా, ఇక్కడ తెలిపిన ప్రయోజనాలు కూడా కలుగచేస్తుంది.
ప్రయోజనాలు
గోధుమల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి నిర్దిష్ట ఆధారాలు ఉన్నప్పటికీ, వీటి నుండి తయారు చేసే చపాతీ వలన కలిగే లాభాల గురించి చాలా మందికి అవగాహన లేదు. చపాతీలు గుండె సంబంధిత వ్యాధులు తగ్గించటంతో పాటూగా, వీటిని తినటం వలన మీ శరీరానికి అందించబడే కొవ్వు పదార్థాల స్థాయిలు కూడా తక్కువే. చపాతీ ల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ క్లుప్తంగా వివరించబడింది.
పోషకాల విలువ
గోధుమలు, విటమిన్ 'B' & 'E', కాపర్, అయోడైడ్, జింక్, మాగ్నస్, సిలికాన్, ఆర్సెనిక్, క్లోరిన్, సల్ఫర్, పొటాషియం, మేగ్నిషియం, కాల్షియం మరియు మినరల్ సాల్ట్ వంటి శరీరానికి కావలసిన పోషకాలను కలిగి ఉంటుంది.
అంతేకాకుండా, గోధుమలతో చేసిన చపాతీ శరీరంలో అనేక అద్భుత ప్రయోజనాలను కలుగచేస్తుంది.
ఆరోగ్యకరమైన చర్మం
చర్మం ఆరోగ్యంగా ఉండటానికి జింక్ మరియు ఇతర మినరల్ లు కూడా అవసరం. ఈ మినరల్ లను గోధుమలు పుష్కలంగా కలిగి ఉంటాయి. గోధుమల ద్వారా చేసిన చపాతీ తినటం వలన చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
జీర్ణక్రియ
చపాతీలు సులభంగా జీర్ణం అవుతాయి, రైస్ తో పోల్చుకుంటే గోధుమలతో చేసిన చపాతీలు త్వరగా, సులభంగా జీర్ణం చెందించబడతాయి. ఈ కారణం చేతనే వైద్యులు జ్వరం వచ్చిన వారికి, రైస్ కి బదులుగా చపాతీ తినమని సలహా ఇస్తారు.
కార్బోహైడ్రేట్లు
గోధుమలు పుష్కలంగా ఆరొగ్యకరమైన కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి, ఇవి శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి.
ఐరన్
మీ శరీర రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచుకోవాలి అనుకుంటున్నారా! అయితే మీరు రోజు తినే భోజనంలో చపాతీ కలుపుకొని తినండి. చపాతీలో ఐరన్ మూలకం పుష్కలంగా కలిగి ఉంటుంది.
క్యాలోరీలు
మీ శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నారా! అయితే చపాతీ తినటం వలన మీ శరీరానికి తక్కువ క్యాలోరీలు అందించబడతాయి. బటర్ లేదా ఆయిల్ లేని చపాతీల నుండి చాలా తక్కువ మొత్తంలో క్యాలోరీలు శరీరానికి అందించబడతాయి.
మలబద్దకం నుండి ఉపశమనం
ఫైబర్ లను అధికంగా కలిగి ఉండే చపాతీలను ప్రతి ఒక్కరి ఆహారంలో కలుపుకోవాలి. ముఖ్యంగా, అజీర్ణం మరియు మలబద్దకం వంటి సమస్యలతో భాదపడే వారి తప్పక చపాతీలను తినటం వలన ఈ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.
క్యాన్సర్ నివారణ
ఫైబర్ మరియు సెలీనియంలను కలిగి ఉన్న చపాతీలు క్యాన్సర్ వ్యాధిని నివారిస్తాయని పరిశోధనలలో కనుగొనబడింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Health benefits of eating chapati."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0