Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Health tips Explanation of how to lose black circles under the eye.

Health tips:కంటి క్రింద నల్లటి వలయాలు ఎలా పోగొట్టుకోవాలో వివరణ.
Health tips Explanation of how to lose black circles under the eye.

  • అసమతుల్యత కారణంగా కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. వీటివల్ల ముఖం కాంతివిహీనంగా కన్పిస్తూ ఉంటుంది. వీటిని నివారించడానికి కొన్ని చిట్కాలివి.
  • చెంచాచొప్పున టొమాటో రసం, నిమ్మరసం, కొద్దిగా సెనగపిండీ, పసుపూ కలిపి కళ్ల కింద రాసి పావుగంట తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. రోజుకు రెండుసార్లు ఇలా చేయడం వల్ల ఫలితం ఉంటుంది. పచ్చిపాలలో దూది ఉండను ముంచి కళ్ల కింద రాసి పది నిమిషాల తర్వాత కడిగేసినా సరిపోతుంది. రాత్రి పడుకునే ముందు బాదం నూనెని కళ్ల కింద రాసి, కొన్ని నిమిషాల పాటు మర్దన చేసి, ఉదయాన్నే చన్నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి.
  •  గులాబీ నీళ్లలో ముంచిన దూది ఉండల్ని కళ్ల మీద పెట్టుకుని పావుగంట తరవాత తీసేయాలి. ఇలారోజుకు రెండుసార్లు చేస్తే మంచిది. సమపాళ్లలో గులాబీ నీళ్లూ, పచ్చి పాలూ కలిపి… దాన్లో దూది ఉండను ముంచి కళ్లపై ఉంచి పావుగంట తర్వాత చన్నీళ్లతో శుభ్రం చేసుకున్నా ప్రయోజనం ఉంటుంది.
  •  చెంచా చొప్పున అనాస రసం, పసుపూ కలిపి ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్నచోట రాసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. చెంచా చొప్పున ఆముదం, పాలమీగడా కలిపి కళ్ల చుట్టూ రాసి పావుగంట తర్వాత కడిగేస్తే సరి. సమపాళ్లలో మొక్కజొన్న పిండీ, పెరుగూ కలిపి కళ్ల కింద రాయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ఫలితం ఉంటుంది. యాపిల్‌లో ఉండే పోషకాలు చర్మానికి మెరుపు తీసుకొస్తాయి, కళ్ల కింద వలయాలను తగ్గిస్తాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Health tips Explanation of how to lose black circles under the eye."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0