Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Local 'Election Rules

'స్థానిక' పోరుకు నిబంధనలివే !
Local 'Election Rules


స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ శనివారం విడుదల చేసింది. పోటీచేసేవారి ప్రవర్తన, సభలు, సమావేశాలు, ఊరేగింపులు, పోలింగ్‌ రోజున పాటించాల్సిన నియమాలు తదితర అంశాలను వెబ్‌సైట్‌లో వుంచింది.

  • పార్టీల నేతలు, అభ్యర్థులు జాతి, కుల, మత, ప్రాంతీయపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదు.
  • ఇతర రాజకీయ పార్టీలను విమర్శించేటప్పుడు వాటి గత చరిత్రను, ఇంతకు ముందు పనితీరును మాత్రమే దృష్టిలో ఉంచుకోవాలి. వ్యక్తిగత దూషణలు చేయకూడదు.
  • రాజకీయ ప్రకటనల ద్వారా కుల, మతపరమైన అభ్యర్థనలు చేయకూడదు. మసీదులు, చర్చీలు, దేవాలయాలు, ఇతర ప్రార్థన, పవిత్ర స్థలాల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదు
  • ఓటర్లకు లంచాలు ఇవ్వడం, బెదిరించడం, ఒకరి స్థానంలో మరొకరిని ఓటరుగా వినియోగించుకోవడం నిషిద్ధం.
  • పోలింగ్‌ స్టేషన్‌కు 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించరాదు. 
  • సభలు, సమావేశాలు, ఊరేగింపుల నిర్వహణకు ముందుగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. సమావేశాలు ఏర్పాటు చేయాలనుకునే చోట నిషేధాజ్ఞలను అభ్యర్థులు ముందుగానే తెలుసుకోవాలి. 
  • లౌడ్ స్పీకర్స్ అనుమతి తీసుకోవాలి.
  •  సభలకు ఎవరైనా భంగం కలిగించేలా ప్రవర్తిస్తే నిర్వాహకులు వారిపై నేరుగా దాడులకు పాల్పడకుండా పోలీసులకు సమాచారం అందించాలి.
  • ఊరేగింపు ఎప్పుడు మొదలవుతుంది? ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఏ మార్గం గుండా వెళుతుంది? తదితర వివరాలన్నీ ముందే పోలీసులకు తెలపాలి. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  •  సమావేశాలు, ఊరేగింపులకు ఇతర పార్టీల నాయకులు వాటికి భంగం కలిగించకూడదు.
  •  నిలదీయకూడదు. కరపత్రాలు పంచరాదు. ఒక పార్టీ వేసిన పోస్టర్లను వేరే పార్టీ వారు తొలగించకూడదు. ఊరేగింపులో మూడు కంటే ఎక్కువ వాహనాలు వాడితే ఎన్నికల వ్యయంలో చూపించాలి.
  • - ఓటర్లు ప్రశాంతంగా, ప్రజాస్వామికంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలు కల్పించాలి. అన్ని పార్టీల నేతలు ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకు సహకరించాలి. పోలింగ్‌ బూత్‌లలో కూర్చునే పార్టీల ప్రతినిధులకు అధికార గుర్తింపు కార్డులు విధిగా అందజేయాలి. వీటిపై పార్టీల గుర్తుల పేర్లు ఉండకూడదు.
  • - ఎన్నికలకు 48 గంటలకు ముందు ప్రచారం చేయకూడదు. ప్రచార రూపంలోని ఎస్‌ఎంఎస్‌లు కూడా నిషిద్ధం. పోలింగ్‌ రోజు, అంతకు 24 గంటల ముందు మద్యం దుకాణాలు, పంపిణీ నిలిపివేయాలి. బూత్‌ల సమీపంలో పెద్ద సంఖ్యలో గుమికూడరాదు. సమీప శిబిరాల్లో పోస్టర్లు, జెండాలు, గుర్తులు, ఇంకా ఇతర ఎన్నికలను సూచించే ఏ సామగ్రినీ ఉంచరాదు. తినుబండారాలు పంపిణీ చేయకూడదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Local 'Election Rules"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0