Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Selavulapai Sandigdham

సెలవులపై సందిగ్ధం
Selavulapai Sandigdham


  • 18 రాష్ట్రాల్లో విద్యా సంస్థలు బంద్ 
  • రాష్ట్రంలో మూసివేతకు సీఎం నిరాసక్తి 
  • పెరుగుతున్న కరోనా అనుమానితులు 
  •  రిస్క్ తీసుకోవడం అవసరమా .
  •  సెలవులిస్తేనే మేలంటున్న అధికారులు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రక టించేశాయి . రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిపై డైలమాలో ఉంది . ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది . ఈ రెండు వారాల వ్యవధిలోనే 120 కేసులు పాజిటివ్ గా తేలాయి . పొరుగున ఉన్న తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యాసం స్థలు , సినిమాహాళ్లు , షాపింగ్ మాలు మూసేయాలని ఆదేశాలిచ్చాయి . బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలను రద్దు చేసుకోవాలని ప్రజలకు ఆదేశాలు జారీచేశాయి . అయితే ఏపీలో ఇప్పటి వరకూ ఒక్క పాజిటివ్ కేసు మాత్రమే నమోదైంది . కానీ , ప్రతి జిల్లాలోనూ రోజుకి ఇద్దరు , ముగ్గురు ఆస్పత్రుల్లో చేరుతు న్నారు . మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో మినీ హెల్త్ ఎమర్జెన్సీని అమలు చేస్తున్న ఆరోగ్య శాఖ . సోమవారం ప్రైవేటు ఆస్పత్రులతో కూడా చర్చలు జరిపింది . ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి వెయ్యి పడకలు సిద్ధం చేసుకోవాలని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాన్ని కోరారు . ఆదివారం సీఎం సమక్షంలో జరిగిన సమావేశంలో కూడా విద్యాసంస్థలు , సినిమా హాళ్ల మూసివేతపై చర్చించారు . సీఎంవోతో పాటు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కూడా సెలవులు ప్రకటిస్తేనే మంచి దని సీఎంకు సూచించారు . దీనిపై సీఎం స్పందిస్తూ . . . ఎన్ని రోజులని సెలవు లిస్తాం . . అవసరం లేదు . . ? వైరస్ ప్రభావం అధికమైన ప్పుడు చూద్దాంలే . . అని దాటవేశారు . దీంతో అధికా రులు కూడా మిన్నకుండిపో యారు . 
సెలవులపై ఒకేమాట
 కరోనా ప్రభావం , ప్రస్తుత పరిస్థితులపై సీఎంవో అది కారి పి . వి . రమేశ్ తొమ్మిది శాఖలతో విజయవాడలో సమావేశంలో నిర్వహించారు . ఈ సందర్భంగా జవహర్ రెడ్డి కరోనాపై అధికారులకు పవర్ పాయింట్ ప్రజంటే షన్ ఇచ్చారు . అనంతరం పాఠశాలు , కళాశాలలు , వర్సిటీలకు సెలవులు అంశం చర్చకు వచ్చింది . ఈ సమయంలో అన్ని శాఖ అధికారులు సెలవులు ప్రటిస్తేనే పాఠశాల విద్యాధికారులు కూడా రిస్క్ తీసుకోవడం ఎందుకన్న ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు . ప్రస్తుతం విద్యార్థు లంతా ఫైనల్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు . సిలబస్ కూడా ఎప్పుడో హర్తయిపో యింది కాబట్టి ఇప్పుడు సెల వులు ప్రకటించినా నష్ట మేమీ లేదన్న అభిప్రా యాన్ని అధికారులు వ్యక్తం చేశారు . కానీ సీఎంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో అధికారుల్లో క్లారిటీ లేకుండా పోయింది . 
13 అనుమానిత కేసులు . . . 
రాష్ట్రంలో ప్రస్తుతం 13 అనుమానిత కేసులున్నాయి . మీదరిని ఆయా జిల్లాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యసేవ లందిస్తున్నారు . మంగళవా రానికి వీరి నివేదికలు వస్తా యని అధికారులు చెబుతు న్నారు . ఇప్పటి వరకూ నెల్లూరు మినహా ఎక్కడా పాజిటివ్ కేసులు నమోదుకాలేదు . 76 శాంపిలో 75 నెగిటివ్ వచ్చాయి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Selavulapai Sandigdham"

Post a comment