Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The decisions taken by the Center from midnight today ...

కేంద్రం తీసుకున్న కఠిన నిర్ణయాలు నేటి అర్ధరాత్రి నుండే అమలు... అవేంటంటే... ?
The decisions taken by the Center from midnight today ...

ప్రపంచానికి ఇప్పుడు కరోనా భయం అంటుకుంది.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ మాయదారి రోగం రోజు రోజుకు తన ప్రతాపం చూపిస్తుంది.. మరణిస్తున్న వారు వేలల్లో ఉండగా, ఈ వ్యాధి సోకిన వారు లక్షల్లో ఉన్నారు.. అందుకే కేంద్ర ప్రభుత్వం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించింది.. ఇందులో భాగంగా అనేక రక్షణ చర్యలు చేపడుతుంది.. ఇప్పటికే విదేశీయుల రాక పోకలపై, వీసాల జారీవిషయంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక ఇదంత ఒకెత్తైతే.. ప్రస్తుతం పొరుగుదేశాల సరిహద్దులు మూసివేయాలనే నిర్ణయం భారత్ తీసుకుంది...
ఈ క్రమంలో ఇండో-బంగ్లాదేశ్‌, ఇండో-నేపాల్‌, ఇండో-భూటాన్‌, ఇండో-మయన్మార్‌, ఇండో-పాక్‌ సరిహద్దుల వెంబడి అన్ని రకాల ప్రయాణికులపై నిషేదాజ్ఞలు విధిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు వెలువరించింది కాగా ఈ ఉత్తర్వులు నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయని అధికారులు తెలిపారు..
ఇదిలా ఉండగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అమెరికా నడుం బిగించింది. అమెరికా వీసాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. మార్చి 16 నుంచి అమెరికా వీసాల జారీ నిలిపివేయాలని యూఎస్ ఎంబసీ, కాన్సులేట్ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించిన అమెరికా దీనిలో భాగంగానే వీసాల జారీని నిలిపివేసింది.

ఇక విదేశీయుల రాకపోకలపై, ఇండియా కూడా ఆంక్షలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 15 వరకు టూరిస్ట్ వీసాలను రద్దు చేసింది. కాగా కేవలం అధికారిక పర్యటనలు, దౌత్యపరమైన వీసాలు, కొందరు వీఐపీల వీసాలకు మాత్రమే ఈ సమయంలో పర్యటించే అవకాశాన్ని కల్పించింది.. ఇదే కాకుండా పలు ఆలయాల్లో కూడా కొన్ని కఠిన నియమాలు అమలు చేస్తున్నారు.. మొత్తానికి ఒక భారత్ కాకుండా దాదాపుగా అన్నిదేశాల్లో ఇలాంటి నిబంధనలే కొనసాగుతున్నాయి.. ఇకపోత ప్రపంచానికి సవాల్ విసురుతున్న ఈ కరోనాను ఎదుర్కోవాలంటే వీలైనంత త్వరగా మందులను కనిపెట్టడమే మార్గం అని చాలామంది అభిప్రాయపడుతున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The decisions taken by the Center from midnight today ..."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0