Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Those who are competing for the position of Sarpanch are eligible.

సర్పంచ్ పదవికి పోటీ చేసే వారికి అర్హతలు ఇవే..
Those who are competing for the position of Sarpanch are eligible.

పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధం అవుతున్నారు . అయితే ప్రభుత్వం సర్పంచ్ పదవులకు పోటీ చేసేందుకు అర్హతలు , అనర్హతలను ప్రకటించింది . అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం 



  • నామినేషన్ వేసే నాటికి అభ్యర్థి వయసు 21 ఏళ్లు పూర్తయి ఉండాలి . 
  •  పోటీ చేసే గ్రామ పంచాయతీ ఓటరు . జాబితాలో తప్పనిసరిగా ఓటరుగా నమోదై ఉండాలి . 
  • ఒక వ్యక్తి ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేదు . 
  • ఒక వేళ ఆ వ్యక్తి 1995 మే 31వ తేదీ కం టీ ముందే ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్ల లను కలిగి ఉన్నట్లయితే ఆమె , అతడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కలిగి ఉం టారు . 
  • 1995 జూన్ 1వ తేదీ తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉంటే ఆ వ్యక్తి పోటీ చేయడానికి అనర్హుడు . 
  •  ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు ఉత్తర్వుల ( డ బ్ల్యూపీ నంబర్ 17947 / 2015 , 2006 జూలై 19 ) ప్రకారం దత్తత ఇచ్చిన పిల్లలు సాంత తల్లిదండ్రులకు చెందిన పిల్లలుగానే పరిగనిస్తరు . 
  • వారిని దత్తత తీసుకొన్న తల్లిదండ్రు లకు చెందిన పిల్లలుగా పరిగణించరు . ఒ
  • వ్యక్తి ముగ్గురు పిల్లలు కలిగి ఉండి వారిలో ఒకరిని దత్తత ఇచ్చినా అనర్హుడిగానే పరిగణి 
  • ఒక వ్యక్తి తన మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలు కలిగి ఉండి భార్య చనిపోయిన తర్వాత రెండో భార్య ద్వారా ఇంకో సంతా నాన్ని పొందితే అతనికి ముగ్గురు సంతానం గా పరిగణిస్తారు .
  •  అతని రెండో భార్య ఒక్క సంతానం కలిగి ఉన్నందున ఆమె పోటీ చేయ దానికి అర్హురాలు , ఆ ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తికి నామినేషన్ పరిశీలనకు ముందు ఒకరు చనిపోతే ప్రస్తుతం ఉన్న పిల్లలను లెక్కలోకి తీసుకుని అతని అర్హతలను నిర్ణయిస్తారు .
  •  ఇద్దరు పిల్లలు ఉన్న తరువాత భార్య గర్భిణి అయినా పోటీకి అనర్హులు . 
  • కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు , స్థానిక సం స్టల్లో ఉద్యోగం చేస్తున్న వారు పోటీకి అర్హులు కారు .
  •  ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం నామినేషన్ పరిశీలన తేదీ నాటికి పోటీ చేస్తున్న వారు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి అది ఆమోదించిన తర్వాత మాత్రమే పోటీకి అర్హులుగా పరిగణించి నామినేషన్ పరిశీలిస్తారు .
  •  రేషన్ దుకాణం డీలర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు . 
  • సుప్రీం కోర్టు తీర్పును పరిగణలోకి తీసుకుని రేషన్ షాప్ డీలర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు అని తీర్పు చెప్పింది -
  • అంగవాడీ వర్కర్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారు . ఆ
  • నీటి వినియోగదారుల సంఘం సభ్యులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అమాశం లేదు 
  • సహకార సంఘాల సభ్యులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కలిగి ఉంటారు . స
  • సంఘాల చట్టం 1954 కింద సహకార సంస్థలు రిజిస్టర్ అవుతాయి . 
  • వారు ప్రత్యేక శాసనసభ ద్వారా చేసిన చట్టం ప్రకారం నియమితులు కాలేదు కాబట్టి వారికి అవకాశం ఉంది .  
  • స్వచ్ఛంద, మత సంబంధ సంస్థల చైర్మన్లు , సభ్యులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేదు . 
  • 1887 హిందూ మత సంస్థల చట్టం , దేవదాయ శాఖ సెక్షన్ ప్రకారం సం స్థలు ఏర్పాటయ్యాయి . 
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సం స్థలో పనిచేసేవారు కూడా అనర్హులు .  
  • అభ్యర్థికిప్రతిపాదకుడిగా ఉన్న వ్యక్తి అదే వార్డు , ప్రాదేశిక నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చు .
  •  అభ్యర్థి తప్పుడు సమాచారం ఇచ్చినప్పటికీ నామినేషన్ తిరస్కరించరు . 
  •  అభ్యర్థి పై ఇతరులు ఫిర్యాదు చేస్తే దానికి రిటర్నింగ్ అధికారి అభ్యర్థి ఇచ్చిన నామినే షన్ పత్రాల్లో ఇచ్చిన సమాచారం తప్పు అని భావించినట్లయితే ఐపీసీ సెక్షన్ 177 , క్రిమి నల్ పోనసర్ కోడ్ 195 ప్రకారం అదే ప్రాం తానికి చెందిన న్యాయస్థానంలో ఫిర్యాదు చేయాలి .
  •  కానీ నామినేషన్ తిరస్కరించరు మతి స్థిమితం లేని వ్యక్తి పోటీకి అనర్హుడు .
  •  నామినేషన్ వేస్తున్న వ్యక్తి ఎలాంటి ధ్రువీక రణ పత్రాలు అదేరోజు ఇవ్వకపోయినా నామినేషన్ తీసుకుంటారు . చె
  • లిస్టులో ఎలాంటి పత్రాలు సమర్పించలేదని నమోదు చేయాలి . 
  • ఆ తర్వాత ఇతర డాక్యుమెంట్లు నామినేషన్ చివరి తేదీ సాయంత్రం 5 గంట లలోపు సమర్పించాలి . ఆ
  • తరువాత ఇచ్చినా స్వీకరించరు . నామినేషన్ తిరస్కరణ అనేది పరిశీలనలో నిర్ణయిస్తాడు . 
  •  పోటీ చేస్తున్న అభ్యర్థికి ప్రతిపాదకుడు నామినేషన్ పత్రాలపై సంతకం పెట్టకుంటే అఫిడవిట్ సమర్పించాలి .


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Those who are competing for the position of Sarpanch are eligible."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0