Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

To farm courses anywhere in the country!

దేశంలో ఎక్కడైనా వ్యవసాయ కోర్సుల్లోకి!
To farm courses anywhere in the country!

వేగంగా ఉద్యోగావకాశాలను అందించే కోర్సుల్లో మన వ్యవసాయం ఒకటి. దేశ ఆర్థికవ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించే ఈ రంగం పట్ల ఆసక్తి ఉంటే డిగ్రీ నుంచే అగ్రికల్చర్‌ ప్రధాన సబ్జెక్టుగా చదువుకోవచ్ఛు పరిశోధనలూ చేయవచ్ఛు ఈ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఐకార్‌ జాతీయస్థాయిలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తోంది.

దేశవ్యాప్తంగా వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు వ్యవసాయం, దాని అనుబంధ విభాగాల్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నాయి. వాటిలో ప్రవేశానికి రాష్ట్రాల వారీగా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కానీ దేశంలోని ప్రతి సంస్థలోనూ ఆయా డిగ్రీల వారీగా 15 నుంచి 25 శాతం సీట్లను జాతీయస్థాయిలో నిర్వహించే పరీక్షలతో భర్తీ చేస్తారు. కొన్ని జాతీయ సంస్థల్లో మొత్తం సీట్లకు ఆ పరీక్షల స్కోరే ప్రామాణికం.ఈ విధానంలో ప్రవేశాలు పొందినవారు ప్రతి నెలా స్టైపెండ్‌ అందుకోవచ్ఛు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ (ఐకార్‌) ఆధ్వర్యంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ప్రకటన వెలువడింది.
అగ్రికల్చర్‌ యూజీ
యూజీ కోర్సులకు నిర్వహించే పరీక్ష ద్వారా సెంట్రల్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలు పూసా, రాంచీ; నేషనల్‌ డెయిరీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, కర్నాల్‌లో ఉన్న మొత్తం యూజీ సీట్లను భర్తీ చేస్తారు. దేశంలోని 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 15 శాతం యూజీ సీట్లకు పోటీ పడటానికి ఈ పరీక్ష రాయడం తప్పనిసరి. మొత్తం 11 బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు.
బీఎస్సీ: అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, ఫిషరీ సైన్స్‌, ఫారెస్ట్రీ, కమ్యూనిటీ సైన్స్‌, ఫుడ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌, సెరికల్చర్‌.
బీటెక్‌: అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌, డెయిరీ టెక్నాలజీ, ఫుడ్‌ టెక్నాలజీ, బయో టెక్నాలజీ కోర్సులు.
వీటిని పలు సంస్థల్లో అందిస్తున్నారు. కోర్సులను బట్టి బైపీసీ లేదా ఎంపీసీలతో ఇంటర్‌ పూర్తిచేసినవారు అర్హులు. కొన్ని కోర్సులకు రెండు గ్రూపులవారూ దరఖాస్తు చేసుకోవచ్ఛు ఇతర రాష్ట్రాల సంస్థల్లో చేరిన విద్యార్థులకు ప్రతి నెలా రూ.2000 స్ట్టైపెండ్‌ అందిస్తారు.
అర్హత: కనీసం 50 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40) శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్ఛు
పరీక్ష విధాన0: వ్యవధి రెండున్నర గంటలు. ఒక్కో సబ్జెక్టు నుంచి 50 చొప్పున మొత్తం 150 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ ఒక మార్కు తగ్గిస్తారు.
పీజీ కోర్సులు:
పీజీ కోర్సులకు నిర్వహించే పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో 25 శాత0 సీట్లను భర్తీ చేస్తారు. నాలుగు జాతీయ సంస్థల్లో మాత్రం వంద శాతం సీట్లకు ఈ స్కోరే ప్రామాణికం. ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఇండియన్‌ వెటర్నరీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, నేషనల్‌ డెయిరీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ ఎడ్యుకేషన్‌లలోని సీట్లకు ఈ స్కోరే ప్రామాణికం. దేశవ్యాప్తంగా పీజీ స్థాయిలో 20 విభాగాల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మెరిట్‌ సాధించిన 600 మంది విద్యార్థులకు ఐసీఏఆర్‌ పీజీ స్కాలర్‌షిప్‌ అందుతుంది. దీని ప్రకారం నెలకు రూ.12,400 స్ట్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇది అందనివారికి నేషనల్‌ టాలెంట్‌ స్కాలర్‌షిప్‌ కింద ప్రతి నెలా రూ.5000 ఇస్తారు
అర్హత: అగ్రికల్చర్‌, అనుబంధ విభాగాల్లో 60 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50) శాతం మార్కులతో యూజీ కోర్సులు పూర్తిచేసినవారు, ఆఖరు సంవత్సరం చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్ఛు
పరీక్ష తీరు: పీజీ పరీక్ష వ్యవధి రెండు గంటలు. సంబంధిత సబ్జెక్టుల నుంచి 120 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ ఒక మార్కు తగ్గిస్తారు.
ఐకార్‌-ప్రవేశ పరీక్షల ప్రకటన విడుదల
దేశంలో ఎక్కడైనా వ్యవసాయ కోర్సుల్లోకి!
జేఆర్‌ఎఫ్‌/ఎస్‌ఆర్‌ఎఫ్‌: దేశంలో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 25 శాతం, మరో అయిదు సంస్థల్లో వంద శాతం పీహెచ్‌డీ (జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌) సీట్లను ఐసీఏఆర్‌ ఆలిండియా కాంపిటిటీవ్‌ ఎగ్జామినేషన్‌తో భర్తీ చేస్తారు. పూర్తి వివరాల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయవచ్చు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31 (అన్ని కోర్సులకూ).
పరీక్ష తేదీ: జూన్‌ 1 (యూజీ, పీజీ, పీహెచ్‌డీ).

https://icar.nta.nic.in

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "To farm courses anywhere in the country!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0