Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

To reduce the stomach .. Follow these little tricks

పొట్ట తగ్గాలంటే..ఈ చిన్నట్రిక్స్ ని పాటిస్తే చాలు.
To reduce the stomach .. Follow these little tricks

అందరూ పగలు తిని పడుకున్నందుకు పొట్ట వస్తుందనుకుంటారు. కానీ అది నిజంకాదు. పొట్ట పెరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అవి ఇక్కడ చూద్దాం.

ఆహారం తినేటప్పుడు ఎక్కువగా నీరు తాగే వారికి పొట్ట సాగుతుంది, కొందరు భోజనాన్ని తక్కువ తినడం కొరకు నీళ్లను ఎక్కువగా తాగి వెంటనే భోజనం ముగించేస్తారు దాంతో ఆ నీరు ఎంతసేపు పొట్టలో ఉంటే అంతసేపు ఆ నీళ్ల బరువుకు పొట్ట ముందుకు సాగుతుంది.

అన్న0 ఎక్కువగా కూర తక్కువగా తినేవారికి, అందులో(అన్నం) ఉండే పిండి పదార్ధాలు అవసరానికి మించి మనలో మిగలడం వల్ల, దాన్ని శరీరం కొవ్వుగా మార్చి…కొవ్వు కణాల్లో దాచేస్తుంది పొట్ట మరియు ఇతర భాగంలో కొవ్వు పెరిగి పోతుంది.

ముఖ్యంగా రాత్రి పూట 10-11 గ0టల సమయంలో తినడం వల్లే శరీరంలో కొవ్వు పెరగటం మొదలవుతుంది ఆ తిన్న ఆహారాన్నంతటినీ దాచే ప్రయత్నం ఎక్కువగా చేస్తుంది. అంతేకాదు మనం గతం లో కంటే ఈ రోజుల్లో మనం చేసే ఉద్యోగాలు కంప్యూటర్ ముందు లేదా ఎక్కువ సేపు కూర్చొని చేసేవి ఎక్కువ అందుకు సాధారణం గా శరీరానికి వ్యాయామం ఉండదు, ఉద్యోగ, వ్యాపారాల్లో కాళ్లు చేతులు కదులుతున్నాయే తప్ప పొట్ట భాగంలో కదలికలు అసలు ఉండటం లేదు. పోనీ చేసే వ్యాయామంలోనూ పొట్ట భాగానికి శ్రమ ఉండటం లేదు. అందుకే రోజురోజుకీ పొట్ట ముందుకు పోతూ ఉంటుంది.

     మరి పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి ?
  • ఎప్పుడు నీళ్లు తాగినా పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు తాగితే పొట్ట ముందుకు సాగదు. 
  • పొట్ట తగ్గాలంటే అన్నాన్ని పూర్తిగా మానేసి రొట్టెల(పుల్కాలు)ను ఎక్కువ కూరతో అంటే మూడు వంతుల కూరతో తినాలి. ఉదయం పూట మొలకెత్తిన విత్తనాలను మాత్రమే టిఫిన్ తింటే నిల్వ ఉన్న కొవ్వు వాటికి కరుగుతుంది.
  • సాయంకాలం భోజనంలో ఉడికినవి మాని 6గంటలకల్లా జామ, దానిమ్మ, బొప్పాయి, రేగి, కమలా, పుచ్చకాయ ఇలాంటి పండ్లను పూర్తిగా తిని ఇక ప్రొద్దుపోయి తినడం ఆపాలి.
  •  పొట్టను తగ్గించడానికి ఇతర వ్యాయామాల కంటే ఆసనాలకే బాగా తగ్గుతుంది. కింద పొట్ట, పైపొట్ట వేరుగా తెలుస్తాయి. ఈ రెండు పొట్టలను తగ్గించడానికి ప్రత్యేకించి కొన్ని ఆసనాలు ఉన్నాయి.
  • జిమ్ లాంటి ఇన్స్టెంట్ ఫిట్నెస్ వల్ల దీర్ఘ కాలికంగా పొట్ట పెరిగే అవకాశాలే ఎక్కువ యోగ, రన్నింగ్, వాకింగ్ మెడిటేషన్ లాంటివి చేస్తే మంచి ఫలితాలుంటాయి. మూడు పూటలా ఆహారం మంచి నిద్ర ఇంకా రోజు కొంత సేపు వ్యాయామం చేయడం.
  • పైన చెప్పినట్లు చేస్తే 2-3 నెలల్లో మీ పొట్ట సగానికి పైగా తగ్గిపోతుంది.


ఆరోగ్య నియమాలు పాటిద్దాం ఆరోగ్యంగా ఉందాం

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "To reduce the stomach .. Follow these little tricks"

Post a comment