Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Walking ten thousand feet a day does not reduce weight.

రోజుకి పదివేల అడుగుల నడక బరువుని తగ్గించదు.వెల్లడించిన నూతన అధ్యయనం.
Walking ten thousand feet a day does not reduce weight.

రోజుకి పదివేల అడుగులు నడిస్తే చాలు . . . శరీరానికి సరిపడా వ్యాయామం లభిస్తుందని ఎప్పటినుండో పరిశోధకులు అంటున్నారు . అయితే రోజుకి పదివేల అడుగులు నడుస్తున్నాం కదా . . . ఇక బరువు అదుపులోనే ఉంటుందని సంబరపడిపోవద్దని మరొక అధ్యయనం చెబుతోంది . అధికబరువుని నియంత్రణలో ఉంచుకోవడానికి పదివేల అడుగులు నడి చాలదని . . . దాంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం , ఇంకాస్త శారీరక వ్యాయామం చేయటం కూడా అవసరమేనని ఆ అధ్యయనంలో వెల్లడైం అందులో తేలిన మరిన్ని వివరాలు ఇవి | అమెరికాలోని బ్రింగ్ హమ్ యంగ్ యూనివర్శిటీ పరిశోధకులతో పాటు మరికొంతమంది కలిసి ఈ అధ్యయనం నిర్వహించారు . ఇందుకోసం వారు 120 మంది కాలేజీ విద్యార్థులను ఎంపిక చేసుకున్నారు . అధ్యయనానికి ముందే విద్యార్థులు . . . వారి అడుగులను లెక్కించే పీడోమీటర్లను . . . ఆరువారాలపాటు 24 గంటలు ధరించేలా చేశారు . ప్రతి విద్యార్థి సగటున రోజుకి 9,600 అడుగులు నడుస్తున్నట్టుగా ఇందులో తేలింది . ఇక అధ్యయనంలో భాగంగా విద్యార్థులను రోజుకి 10,000 లేదా 12,500 లేదా 15000 అడుగులు చొప్పున వారా ఆరురోజులపాటు 24వారాలు నడవమని చెప్పారు . నడుస్తున్నపుడు వారిలో ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయి , ఎంత బరువు తగ్గారు  అనే విషయాలను నమోదు చేశారు . పదివేలు అంతకంటే ఎక్కువ అడుగులు నడిచినవారిలో బరువు , కొవ్వుశాతం తగ్గాయా అనే అంశాన్ని గమనించారు . అయితే ఆరునెలల్లో వారు బరువు తగ్గకపోగా అధ్యయనం జరుగుతున్న కాలంలో ఒకటిన్నర కిలోల వరకు బరువు పెరిగినట్టుగా గుర్తించారు . ఇంతకుముందు నిర్వహించిన అధ్యయనాల్లో సైతం విద్యార్థులు కాలేజిలో చేరిన మొదటి సంవత్సరంలో ఒకటినుండి నాలుగు కిలోల వరకు సగటున బరువు పెరిగినట్టుగా తేలింది . నడక ఒక్కటే బరువుని తగ్గించ లేదని బ్రింగ్ హమ్ యంగ్ యూనివర్శిటీలో ఎక్సర్‌సైజ్ ప్రొఫెసర్ , అధ్యయన నిర్వాహకులు అయిన బ్రూస్ బైలీ అంటున్నాడు . అడుగులు లెక్కవేసుకోవటం వలన మరింత ఉత్సాహంగా నడిచే అవకాశం ఉంటుంది తప్ప అది బరువు నిర్వహణకు గానీ . బరువు పెరగకుండా ఆపటానికి గానీ ఉపయోగపడదని బ్రూస్ బైలీ చెబుతున్నాడు . అయితే పదివేల అడుగులు బరువుని తగ్గించక పోయినా అలా నడిచినవారిలో శారీరక చురుకదనం , ఆరోగ్యం పెరగటంతో పాటు భాద్వేగపరమైన ఆరోగ్యం సైతం పెరగటం గమనించారు . 10 వేల అడుగులకంటే ఎక్కువ అడుగులు నడిచినవారిలో శారీరక కదలికలు లేకుండా ఉన్నకాలం తగ్గినట్టుగా కూడా గుర్తించారు . 15 వేల అడుగులు నడిచినవారిలో కదలకుండా ఉండే సమయం  ఇతరులతో పోల్చినప్పుడు రోజుకి 77 నిముషాలవరకు తగ్గింది . రోజంతటిలో ఎక్కువ అడుగులు నడవటం వలన బరువు తగ్గకపోయినా కదలకుండా కూర్చునే జీవనశైలి మారుతుందని . ఎన్ని ఎక్కువ అడుగులు నడిస్తే ఆరోగ్యానికి అంత చేరువ అవుతామని బైలీ అంటున్నాడు . రోజంతా ఇంట్లో నడుస్తూనే ఉంటున్నాం కదా బరువు తగ్గుతాములే అనుకునే మహిళలు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ బరువు తగ్గేందుకు మరిన్ని వ్యాయామాలు చేయాల్సిందేనన్నమాట .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Walking ten thousand feet a day does not reduce weight."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0