Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

What is the Janata curfew? Spray Chemicals in Helicopters?

జనతా కర్ఫ్యూ అంటే ఏమిటి ? హెలికాప్టర్ లలో కెమికల్స్ చల్లుతారా ?


ఎక్కడ చూసినా కరోనా వైరస్ రాజ్యమేలుతోంది. దీని వల్ల వేల మంది మరణిస్తున్నారు.. లక్షలాది మంది బాధితులుగా మారుతున్నారు. చైనాలో మొదలై, యూరప్‌ ని అల్లకల్లోలం చేస్తూ, అగ్రరాజ్యాన్ని కూడా అతలాకుతలం చేస్తోంది కరోనా. ఈ వైరస్‌ ని మన దేశంలో అడ్డుకోవటానికి ఆదివారం ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ అమలు చేయాలని భారత ప్రభుత్వం సూచిస్తోంది.

జనతా కర్ఫ్యూ అవగాహన లేక పాపం కొంతమంది ఎలికాఫ్టర్లతో మందు జల్లుతారంట అని అందరూ ఒకరికొకరు చెప్పుకొంటున్నారు ఫోన్లు చేసి మరీ జగర్తలు చెప్పుకొంటున్నారు .జనతా కర్ఫ్యూ యొక్క లక్ష్యం అందరికి తెలియక పోయినా జనతా కర్ఫ్యూ మాత్రం అందరిలోకి వెళ్ళిపోయింది ఐతే మనం చేయాల్సింది వారికి దీని గురించి పూర్తి స్థాయిలో తెలియపరచడమే.
జనతా కర్ఫ్యూ అందరూ చేయాల్సిందేనా.. దీని వల్ల లాభమేంటి..దీనివల్ల కరోనా వైరస్ పూర్తిగా తగ్గిపోతుందా? కర్ఫ్యూ సమయంలో ఏం చేయాలి? ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గార్లు ఏం సూచిస్తున్నారు. ఇల్లు కదలకండి.. ఒక్కరోజు పూర్తిగా ఇంటికే పరిమితం కండి.. పరుగులు పెట్టే నగరాలకు...ప్రవహించే దేశానికి ఒక్కసారిగా బ్రేక్‌ వేయండి.
కరోనా వ్యాప్తిని పూర్తిగా అడ్డుకోండి. ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఇదే సూచిస్తున్నారు.

కరోనా వైరస్ ప్రజలు తిరిగే ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటుంది. వైరస్ వున్న స్థలాల్లో వుండడం, తాకడం వల్ల ఈ వైరస్ గణనీయంగా వ్యాప్తి చెందుతుంది. ఎవరూ బయటికి రాకుండా ఉంటే, కొంత వరకు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే అవకాశం ఉంది. దేశమంతా ఇంటిలోపలే వుంటే పబ్లిక్ ప్లేసుల్లోని వైరస్ మరణించి, వ్యాప్తి చెందడాన్ని ఆపే వీలుంటుంది.

అందుకే ప్రజలతా ఆదివారం మార్చి 22, ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్లల్లోనే ఉండాలని భారత ప్రభుత్వం సూచిస్తోంది. ఆదివారం ఇంట్లోనే ఉండి జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. డాక్టర్లు, నర్సులు, ఎయిర్ లైన్ స్టాప్ సేవలో నిమగ్నమై ఉన్నారని, తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పనిచేస్తున్నారన్నారు. అలాంటి వారికి ఆదివారం రాత్రి ధన్యవాదాలు చెబుదామన్నారు. 22న సాయంత్రం 5 గంటలకు ఇంటి గుమ్మం ముందుకు వచ్చిఅందరూ చప్పట్లు కొట్టి ప్రజా సేవకులకు సెల్యూట్ చేద్దామన్నారు.

అంతేకానీ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు ఎవరూ హెలికాప్టర్ లతో ఎటువంటి కెమికల్స్ చల్లరు. కేవలం . వైరస్ వున్న స్థలాల్లో వుండడం, తాకడం వల్ల ఈ వైరస్ గణనీయంగా వ్యాప్తి చెందుతుంది. ఎవరూ బయటికి రాకుండా ఉంటే, కొంత వరకు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే అవకాశం ఉంది. దేశమంతా ఇంటిలోపలే వుంటే పబ్లిక్ ప్లేసుల్లోని వైరస్ మరణించి, వ్యాప్తి చెందడాన్ని ఆపే వీలుంటుంది. కాబట్టే ఇలా పద్నాలుగు గంటలు ఈ కర్ఫ్యూ విధించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "What is the Janata curfew? Spray Chemicals in Helicopters?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0