Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Work From Home: Here are 9 tips to increase your WiFi speed

Work From Home : మీ వైఫై స్పీడ్ ని పెంచే 9 టిప్స్ ఇవే.

Work From Home: Here are 9 tips to increase your WiFi speed

Boost Wifi Speed | మీరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా ? మీ ఇంట్లో ఇంటర్నెట్ సమస్యలు ఉన్నాయా ? వైఫై స్పీడ్ పెంచాలనుకుంటున్నారా ? ఈ టిప్స్ ఫాలో అవండి .

కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో అనేక కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయాలు తమ సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లక్షలాది మంది ఉద్యోగులు ఇళ్ల నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఇంటి నుంచి పనిచేయాలంటే ముఖ్యంగా కావాల్సింది ఇంటర్నెట్ కనెక్షన్. చాలామంది వైఫై పైన ఆధారపడుతున్నారు. అయితే మంచి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఉన్నా సరే... వైఫై సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల స్పీడ్ తగ్గుతూ ఉంటుంది. మీరూ అదే సమస్య ఎదుర్కొంటున్నారా? మరి వైఫై స్పీడ్ పెంచడానికి ఏం చేయాలో తెలుసుకోండి.

  • 1. ముందుగా వైఫై అవసరం లేని డివైజ్‌లు ఏవైనా ఉంటే మీ రౌటర్ నుంచి డిస్‌కనెక్ట్ చేయండి. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, స్మార్ట్‌టీవీ, ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఇలా మీరు దేనికి వైఫై ఉపయోగించకపోతే ఆ డివైజ్‌ను డిస్‌కనెక్ట్ చేయాలి.
  • 2. మీ రౌటర్ ఎక్కడ పెట్టారు అన్నది కూడా ముఖ్యమే. ఎలక్ట్రికల్ పరికరాలకు, గోడలకు కాస్త దూరంగా వైఫై ఏర్పాటు చేయండి. వైఫై సిగ్నల్స్‌ని గోడలు అడ్డుకునే అవకాశముంది. రౌటర్ చుట్టూ కాస్త స్పేస్ ఉండేలా ఏర్పాటు చేయండి. రిఫ్రిజిరేటర్ల లాంటి అప్లయెన్సెస్‌కు దూరంగా రౌటర్ ఉండాలి.
  • కరోనా వైరస్ ప్రభావం, కరోనా వైరస్ వ్యాప్తి, వర్క్ ఫ్రమ్ హోమ్, వైఫై స్పీడ్ ఎలా పెంచాలి, ఇంటర్నెట్ స్పీడ్ ఎలా పెంచాలి
  • 3. వేర్వేరు ఎస్ఎస్ఐడీలను క్రియేట్ చేయండి. ఏ డివైజ్‌కు ఎంత స్పీడ్, డేటా కేటాయించాలో అంతే సెట్ చేయండి. మీరు పనిచేసే డివైజ్‌లకు కాస్త ఎక్కువ స్పీడ్, డేటా అవసరం. దీని వల్ల మీ వర్క్‌కు ఇబ్బంది లేకుండా ఉంటుంది.
  • 4. మీ వర్క్ డివైజ్‌కు ఫ్రీక్వెన్సీ వేరుగా ఉంచండి. ఆ ఫ్రీక్వెన్సీకి ఇతర డివైజ్‌లను కనెక్ట్ చేయొద్దు. ఉదాహరణకు డ్యూయెల్ బ్యాండ్ రౌటర్ ఉంటే వేర్వేరు ఫ్రీక్వెన్సీలు ఉంటాయి. అందులో ఒక ఫ్రీక్వెన్సీ మీ వర్క్ డివైజ్‌కు కేటాయించాలి.
  • 5. మీరు రౌటర్‌కు దగ్గర పనిచేస్తున్నట్టైతే లాన్ కేబుల్‌ ఉపయోగించాలి. వైర్‌లెస్ కనెక్షన్ కన్నా, ల్యాన్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువ.
  • 6. మీ డ్యుయెల్ బ్యాండ్ రౌటర్‌లో 2.4GHz కన్నా 5GHz ఫ్రీక్వెన్సీని ఉపయోగించండి. 5GHz ఫ్రీక్వెన్సీతో ఎక్కువ స్పీడ్‌ ఉంటుంది.
  • కరోనా వైరస్ ప్రభావం, కరోనా వైరస్ వ్యాప్తి, వర్క్ ఫ్రమ్ హోమ్, వైఫై స్పీడ్ ఎలా పెంచాలి, ఇంటర్నెట్ స్పీడ్ ఎలా పెంచాలి
  • 7. ఒకవేళ మీ వర్క్ డివైజ్‌కు రౌటర్‌కు మధ్య 10 అడుగుల దూరం ఉంటే 2.4GHz ఫ్రీక్వెన్సీ ఎంచుకోండి. దీని వల్ల సిగ్నల్ స్ట్రెంత్ బాగుంటుంది.
  • 8. వైఫై డెడ్ జోన్స్ తెలుసుకునేందుకు థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించొచ్చు. ఎందుకంటే ప్రతీ రౌటర్‌కు లిమిటేషన్ ఉంటుంది. ఎన్ని యాంటెన్నాలు ఉన్నా డెడ్ జోన్స్ ఉంటాయి.
  • 9. వైఫై కవరేజీని పెంచేందుకు రిపీటర్స్, ఎక్స్‌టెండర్స్ ఉపయోగించొచ్చు. మీ ఇంట్లో ఎక్కువ డెడ్‌జోన్స్ ఉన్నట్టైతే ఇవి ఉపయోగపడతాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Work From Home: Here are 9 tips to increase your WiFi speed"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0