Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

5000 Jagan Sarkar for the Brahmins who do the priesthood

లాక్‌డౌన్ః అర్చకత్వం చేసే బ్రాహ్మణులకు  5000 జగన్ సర్కారు నిర్ణయం


5000 Jagan Sarkar for the Brahmins who do the priesthood

కరోనా నేపథ్యంలో దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది.ప్రజలు గడపదాటి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు అన్ని మూతపడ్డాయి. విద్యా,వ్యాపార, రవాణా వ్యవస్థలు స్థంబించిపోయాయి. ఆఖరుకు దేవాలయాలకు కూడా తాళాలు వేశారు. దీంతో దేవుడికి నిత్యకైంకర్యాలు నిర్వహించే అర్చకుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ నిర్ణయంతో వేలాది మంది అర్చకులకు లబ్ఢి చేకూరనుంది.
లాక్‌డౌన్ నేపథ్యంలో ఆలయాల్లో భక్తుల దర్శనాలు నిలిపివేశారు. దీంతో ఆదాయం కోల్పోయిన అర్చకులను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఈ మేరకు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో.. చిన్న ఆలయాల్లో పనిచేసే అర్చకులకు రూ.5,000లు గ్రాంట్‌ రూపంలో చెల్లించనున్నట్లు దేవదాయ శాఖ మంత్రి శ్రీనివాసరావు తెలిపారు. దేవదాయ శాఖ నుంచి ఎలాంటి నెలవారీ జీతాలు పొందని, ధూప దీప నైవేద్యం వంటి పథకాల ద్వారా లబ్ధి పొందని వారికి అర్చక సంక్షేమ నిధి నుంచి ఈ సాయాన్ని అందజేయనున్నారు.
కరోనా నేపథ్యం, లాక్‌డౌన్‌కు ముందు నుంచే ఆలయాల్లోకి భక్తులను అనుమతించడం లేదు. దీంతో అర్చకులు మాత్రమే ఏకాంతంగా నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. చిన్న ఆలయాలకు ఎలాంటి ఆదాయం లేదు.. అర్చకుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అందుకే అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌ ద్వారా ఒక్కొక్కరికి రూ. 5000 గ్రాంట్ ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ధూప దీప నైవేద్యం, అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌ ద్వారా 2,800 మందికి పైగా అర్చకులకు ప్రతి నెలా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం వర్తించని వారు రాష్ట్ర వ్యాప్తంగా 2,500 మంది అర్చకులు ఉన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "5000 Jagan Sarkar for the Brahmins who do the priesthood"

  1. అయ్యా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న మనవి మరియు విన్నపం మీరు తెలిపిన టువంటి బ్రాహ్మణ అత్యధిక వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఐదు వేల రూపాయలు ప్రతి అర్చకులకు ఇచ్చేటట్టు గా మీరు ఆమోదం ఇచ్చారు దానికి చాలా సంతోషిస్తున్నాము కానీ మీరు తెలిపిన టువంటి వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఇచ్చేటువంటి ధనసహాయం ఇది కేవలం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధి లో ఉన్నటువంటి దేవాలయాలకు మాత్రమే వర్తిస్తుంది ఇది కాకుండా మిగిలిన కొన్ని సంస్థల ద్వారా నిర్వహిస్తున్న టువంటి దేవాలయాలు కూడా ఉన్నాయి కొన్ని సంస్థలు నిర్వహిస్తున్న టువంటి దేవాలయాలు అందులో 90 శాతం చిన్నపాటి దేవాలయాలు ఆ దేవాలయానికి సంబంధించినంతవరకు భక్తుల యొక్క రాకతోనే అన్ని ముడిపడి ఉంటాయి కావున మీరు ఇచ్చేటువంటి ఈ పారితోషికం మిగిలిన ఎటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో పట్టణాల్లో మరియు పల్లెల్లో గ్రామాల యందు దేవాలయాల్లో అర్చక వృత్తి చేసేటటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారు వారిలో ఇంకా కొంతమంది మీరు చెప్పినటువంటి అర్చక వెల్ఫేర్ అసోసియేషన్ భాగస్వాములుగా లేరు కనుక వారికి మీరు ఇచ్చేటువంటి ఈ పారితోషికం వారికి అందదు కావున వారిని మీరు గుర్తించి దయచేసి ఈ పారితోషికం పారితోషికం వారికి కూడా గుర్తించే విధంగా అమలుపరిస్తే చాలా బాగుంటుందని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు వెల్లంపల్లి శ్రీనివాస రావు గారిని ద్వారా రా కు కు మేము చేయు విన్నపము కావున దయచేసి ఇ ఈ ఈ విన్నపాన్ని పరిగణలోకి తీసుకొని పరిశీలించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు తమ విధేయులు అర్చక స్వామి నాగరాజు శర్మ సంగడిగుంట గుంటూరు నమస్కారం

    ReplyDelete