Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Central government granted Clarity on exemption of farmer from lockdown.

లాక్ డౌన్ నుండి రైతుకు మినహాయింపు పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.
Central government granted Clarity on exemption of farmer from lockdown.

లాక్​డౌన్​ ఉన్నా వ్యవసాయ కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. క్షేత్రస్థాయి సిబ్బంది ఇందుకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్దేశిస్తూ లేఖ రాసింది.

వ్యవసాయ కార్యకలాపాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపులు ఇచ్చినట్లు కేంద్రం మరోసారి స్పష్టంచేసింది. ఈ విషయంలో క్షేత్ర స్థాయి సిబ్బంది గుర్తెరిగి వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా రాష్ట్రాలకు లేఖ రాశారు. పంట కోతల కాలం కాబట్టి... వ్యవసాయ పనులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని, పంట కోసే యంత్రాలు సహా కొనుగోళ్ల కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడాలని సూచించారు.

వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు మినహాయింపులు ఇచ్చినట్లు లేఖలో పేర్కొన్నారు అజయ్. రైతులు, వ్యవసాయ కూలీలు, పంట సేకరణదారులు, మార్కెట్ నిర్వాహకులు, పంట కోతల యంత్రాలన్నింటికీ మినహాయింపులు ఉన్నాయని స్పష్టత ఇచ్చారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Central government granted Clarity on exemption of farmer from lockdown."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0