Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Central Government Health Guidelines Latest Guidelines


  • ఇంట్లోనే చికిత్స కరోనా తీవ్రత తక్కువగా ఉన్నవారికి ఊరట  
  • ప్రత్యేక ఐసోలేషన్లో  ఇంట్లోనే చికిత్స పొందే వీలు
  •  ఆరోగ్యసేతు యాప్ తో నిరంతర నిఘా  వైరస్ తీవ్రత పెరిగినా , నిబంధనలు పాటించకున్నా ఆస్పత్రికి బాధితుల తరలింపు.
Central Government Health Guidelines Latest Guidelines


 కేంద్ర ఆరోగ్యశాఖ తాజా మార్గదర్శకాలు 
  కరోనా బాధితులకు చికిత్సపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది . కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయి , వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నవారు తమ ఇంట్లోనే చికిత్స పొందే అవకాశం కల్పించింది . అలాంటివారు ఇంట్లోనే ప్రత్యేక ఐసోలేషన్లో ఉంటూ వైద్యులు సూచించిన మందులు వాడేందుకు అనుమతించింది . దీని కోసం ముందుగా స్వీయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది . ఈ మేరకు కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమశాఖ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది . అయితే ఇరుకైన ఇళ్లున్నవారికి ఈ వెసులుబాటు వర్తించదు . మిగతా కుటుంబ సభ్యులతో కలవకుండా ప్రత్యేక గదిలో ఉండటా నికి వీలున్న వారికే ఇది వర్తిస్తుంది . ఒకవేళ వైద్యుల పర్యవేక్షణలో ఆస్పత్రుల్లో ఉండేందుకు ముందుకొస్తే వారికి అలాగే చికిత్స అందజేస్తారు . అయితే నూతన విధానం సాధ్యాసాధ్యాలపై పలువురు వైద్య నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు . . . . 
వైద్యుడి సలహా మేరకే ఇంట్లో చికిత్స . . . 

  • కరోనా పాజిటివ్ లక్షణాలుండి , తీవ్రత తక్కువగా ఉన్న రోగి ఇంట్లో ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందాలంటే వైద్యుడి అనుమతి తప్పనిసరి .
  •  అలా ఉంచడం వల్ల వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులుండవని వైద్యుడు నిర్ధారించాలి . 
  • బాధితుడు స్వీయ నిర్బంధంలో ఉండే పరిస్థితులు ఉన్నాయో లేదో డాక్టర్ తెలుసుకోవాలి .
  •  రోగి సంరక్షణ బాధ్యతలు తీసుకునేవారు తప్పనిసరిగా  ప్రొటోకాల్ ప్రకారం హైడ్రాక్సీక్లోరోక్విన్ ముందరి , రోడకశక్తి నిచ్చే ఆహారం తీసుకోవాలి .
  •  రోగి మొబైల్ లో తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ ఉండాలి . బ్లూటూత్ ) లేదా వైఫై ద్వారా ఎల్లప్పుడూ యాక్టివ్ లో ఉండాలి 
  •  వైద్య నిఘా బృందాలు బాధితుడి కదలికలను ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుంటాయి . 
  • ఇవన్నీ సక్రమంగా పాటించే వారు మాత్రమే ఇంట్లో ఉంటూ చికిత్స తీసుకునేందుకు అర్హులని కేంద్రం స్పష్టంచేసింది . 

రోగిలో మార్పులొస్తే . . . . 

  • కరోనా తీవ్రత , లక్షణాలు పెరిగితే బాధితుడు . 
  • వెంటనే వైద్య సాయం పొందాలి .
  •  శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది , ఛాతీలో నిరంతరం నొప్పి , ఒత్తిడి లక్షణాలు కనిపిస్తే వైద్యుడికి సమా చారం ఇవ్వాలి .
  •  మానసిక గందరగోళం , పెదవులు లేదా ముఖం నీలిరంగు రంగు లోకి మారడం కూడా వ్యాధి తీవ్రతగా భావించి డాక్టర్‌కు సమా చారం ఇవ్వాలి . 

ఇంట్లో ఎలా ఉండాలంటే ? 

  • బాధితుడు ట్రిపుల్ లేయర్ మెడికల్ మాస్క్ ఎల్లప్పుడూ వాడాలి . 
  • 8 గంటలు ఉపయోగించిన తర్వాత మార్చాలి . 
  • తడిగా ఉన్నా , మురికిగా ఉన్నా వెంటనే తొలగించాలి . 
  •  మాస్కు సోడియం హైపోక్లోరైట్ తో శుభ్రపరిచిన తరువాత తగిన జాగ్రత్తలు తీసుకుని పారేయాలి .
  •   వృద్ధులు , బీపీ , షుగర్ , గుండె , కిడ్నీ , ఇతర అనారోగ్య బాధి తులకు దూరంగా ఉండాలి . 
  • బాధితులు తమ వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచు కోరాదు . 
  • రోగి తాకిన ప్రదేశాలను , వస్తువులను , మందులను , తలుపు హ్యాండిళ్లను హైపోక్లోరైట్ ద్రావణంతో కడగాలి. 

సహాయకులకు సూచనలు . . . 

  •  బాధితులకు సాయపడే వ్యక్తులు ట్రిపుల్ లేయర్ మెడికల్ మాస్క్ ధరించాలి .
  •  బాధితుల శరీర ద్రవాలు , నోటి ద్వారా వచ్చే తుంపర్లకు దూరంగా ఉండాలి .
  •  సపర్యలు చేసేప్పుడు గ్లోజులు ధరించాలి . 
  • బాధితులతో సిగిరెట్లు పంచుకోవడం నిషిద్ధం వారు వాడిన పాత్రలు , వంటకాలు , పానీయాలు , ఉపయోగించిన తువ్వాళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదు . 
  • రోగి వాడిన సబ్బును కూడా వినియోగించకూడదు . 
  •  రోగి దుస్తులు , వస్తువులను శుభ్రపరిచేటప్పుడు ట్రిపుల్ లేయర్ మెడికల్ మాస్క్ తోపాటు , గ్లోజ్ లు వేసుకోవాలి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Central Government Health Guidelines Latest Guidelines"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0