Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Data collection from large exercise districts for teacher replacement


  • టీచర్ల భర్తీకి భారీ కసరత్తు జిల్లాల నుంచి డేటా సేకరణ
  • లాక్ డౌన్ పూర్తయిన వెంటనే నోటిఫికేషన్
  • విద్యా సంవత్సరం మొదలయ్యేలోపే పూర్తి చేయాలని లక్ష్యం

Data collection from large exercise districts for teacher replacement

 రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది . అందులో భాగంగా ప్రభుత్వ ఆయా యాజమాన్యాల పరిధుల్లోని పాఠశాలల్లో ఖాళీల సంఖ్యను జిల్లాల వారీగా సేకరిస్తోంది . అందుకోసం ఇప్పటికే జిల్లాల విద్యాశాఖాధి కారులకు ఆదేశాలు కూడా చేశారు . గతేడాది ప్రభుత్వ పరిధిలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య , ఉపాధ్యాయుల సంఖ్య బట్టి స్టూడెంట్ , టీచర్ నిష్పత్తిని లెక్కించనున్నారు . దాని ప్రకారం ఈ ఏడాది పై తరగతుల్లోకి వెళ్లే విద్యార్థుల సంఖ్య , కొత్తగా అడ్మిషన్లు ఎన్ని వస్తాయనే అంచనా , రిటైరయ్యే ఉపాధ్యాయుల సంఖ్యలను అంచనా వేసి , తదనుగుణంగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది . తొలుత ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( టెట్ ) నిర్వహించి , తర్వాత నియామక పరీక్ష ద్వారా భర్తీ చేసేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది . పెద్ద సంఖ్యలోనే ఖాళీలు . . రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి . అనేక చోట్ల ఏకోపాధ్యాయులతో పాఠశాలలు నడుస్తున్నాయి . మరికొన్ని చోట్ల అయితే కనీసం  ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేరు . అయితే ఇప్పటి వరకు ప్రాథమికంగా ఖాళీలపై విద్యాశాఖకు సమాచారం అందింది . దానిపై జిల్లాల విద్యాశాఖాధికారుల ఆధ్వర్యంలో తక్షణమే భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య అందించాలని ప్రభుత్వం ఆదే శించింది . 13 జిల్లాల్లో ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడు లేని ప్రాథమిక పాఠశాలల సంఖ్య 507గా ఉంది . మండల పరిషత్ , జిల్లా పరిషత్ ల పరిధి లో నడుస్తున్న పాఠశాలలైతే 1456 ఉన్నట్లు లెక్కలు వచ్చాయి . ఇక ఏకోపాధ్యాయులతో నడుస్తున్న పాఠశాలల సంఖ్య ప్రభు త్వ యాజమాన్యంలోనివి 1207 కాగా . . మండల పరిషత్ , జిల్లా పరిషత్ ఆధ్వర్యంలోనివి దాదాపు 8 వేల 203 ప్రాథమిక పాఠశాలలుగా ఉన్నట్లు జిల్లాల నుంచి సమాచారం సేకరించా రు . అయితే జిల్లాల విద్యాశాఖాధికారుల ఆధ్వర్యంలో పరిశీ లించి , వాస్తవ నివేదికలు అందించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు . ఈ నేపథ్యంలో మే మొదటి వారంలో పూర్తిస్థాయిలో అంచనాలు రానున్నాయి . 
2018 డీఎస్సీ నియామకాలు పూర్తయ్యాకే . . 
2018లో నిర్వహించిన డీఎస్సీలో భర్తీ చేయాల్సిన వేలాది పోస్టులు న్యాయస్థానాల్లో కేసుల కారణంగా నిలిచిపోయాయి . అందుకోసం కోర్టుల్లో ఉన్న కేసులు త్వరగా పరిష్కారమయ్యే లా కౌంటర్లు వేయడంతోపాటు , తీర్పు వచ్చేలోపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( టెట్ ) నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోం ది . ప్రతి సంవత్సరంటెట్ రెండుసార్లు నిర్వహించాల్సి ఉన్నా . . వివిధ కారణాల వల్ల , ఇప్పుడు కరోనా వల్ల పరీక్షలు జరగలేదు . 2018లో డీఎస్సీ , టెట్ ఒకేసారి నిర్వహించారు . ఈసారి మాత్రం ముందుగా టెట్ నిర్వహించాలని భావిస్తున్నారు . మరోవైపు డీఎస్సీ 2018 సమస్యను త్వరితగతిన పరిష్కరించి నియామకాలు పూర్తి చేయాలని , ఆ వెంటనే అవసరమైన అన్ని ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది . 2018 డీఎస్సీలో 2 వేల 278 ఎసీటీ , 340 పీఈటీ , 248 భాషా పండి తులు , 77 ఆదర్శ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరా లు న్యాయవివాదాల కారణంగా నిలిచిపోయాయి . వీటి నియామక ప్రక్రియ పూర్తి చేసి , ఆ వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు . ఏడాదిగా వరుస వాయిదాలు . . గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ప్రభు త్వం ఏర్పాటైన నాటి నుంచి డీఎస్సీపై విద్యాశాఖ మంత్రి డా . ఆదిమూలపు సురేష్ ప్రకటనలు చేస్తూనే వస్తున్నారు . తొలుత ఆగస్టు , తర్వాత డిసెంబర్ అంటూ ఎన్నోసార్లు వాయి దా వేశారు . గతేడాది డిసెంబర్ లోనే సుమారు 8 వేల పోస్టుల అంచనాతో జనవరిలో నోటిఫికేషన్ ఇస్తామంటూ పలు వేదిక లపై ప్రకటించినప్పటికీ ఆచరణలో మాత్రం కార్యరూపం దాల్చ లేదు . కాగా లాక్ డౌన్ ముగిసిన వెంటనే కొత్త విద్యా సంవత్స రానికి సంబంధించిన షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ఉపాధ్యాయులే లేని , ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అవసరమై న పోస్టులను తప్పనిసరిగా భర్తీ చేయాల్సి ఉంది . అంతే కాకుం డా కొత్త విద్యా సంవత్సరంలో తెలుగు , ఆంగ్ల మాధ్యమాలు సమాంతరంగా కొనసాగించాల్సి ఉండటంతో ఉపాధ్యాయుల భర్తీ అవసరం మరింతగా పెరిగింది . ఈ నేపథ్యంలో ఖాళీలపై కసరత్తు త్వరితగతిన పూర్తి చేసి , విద్యా సంవత్సరం ప్రారంభం లోపే ఒక కొలిక్కి తేవాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Data collection from large exercise districts for teacher replacement"

Post a comment