Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Inspiration

Inspiration
Inspiration

సులోచన, వయసు 24 సంవత్సరాలు. 
గర్భవతి. తమిలనాడు, తిరుచిరాపల్లి జిల్లా రెట్టియపట్టి గ్రామం. నొప్పులు రావడంతో, భర్త మరో బంధువుతో కలిసి  తమ గ్రామం నుండీ 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనప్పరాయ్ లోని ఆస్పత్రికి అంబులెన్స్ లో వెళ్ళారు. సిజేరియన్ చేయించుకుంటే బెటర్ అని అక్కడి డాక్టర్లు సలహా ఇచ్చారు. కాకపోతే, సిజేరియన్ సమయంలో రక్తం ఎక్కించాల్సి ఉంటుందనీ, లాక్ డౌన్ వల్ల ఆస్పత్రిలో రక్తం అందుబాటులో లేదనీ, డోనర్ ని తీసుకుని రావాలని గానీ, లేకపోతే, ఊరికి వెళ్ళి, నాలుగురోజుల తర్వాత తిరిగి రావల్సిందిగా డాక్టర్లు సూచించారు.

ఆ ఊరిలో తమకు తెలిసిన వారు ఎవ్వరూ లేకపోవడంతో, రక్తం దొరకడం అయ్యేపని కాదని, తమ గ్రామానికి తిరిగి వెళ్ళిపోవాలనీ వారు డిసైడ్ చేసుకున్నారు. కానీ, తమను ఆ హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసిన అంబులెన్స్ అప్పటికే వెళ్ళిపోయింది. ఎలాగోలా సెంటర్ కి వెల్తే అక్కడ ఏవైనా వెహికల్స్ ఉండొచ్చని, సులోచన, ఆవిడ భర్త, మరో బంధువు , ముగ్గురూ కలిసి మెల్లగా రోడ్డుపై నడుచుకుంటూ బయల్దేరారు.

రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఈ సమయంలో ఎక్కడికి వెల్తున్నారని వారిని ఆపి అడిగాడు. ఆస్పత్రి నుండీ తమ గ్రామానికి వెల్తున్నామని వారు చెప్పడంతో, వారికి ట్యాక్సీ ని అరేంజ్ చేశాడు. ఇంతలో అణుమానమొచ్చి, నెలలు నిండినతర్వాత, ఆసుపత్రికి కాకుండా, ఇంటికెందుకెల్తునారని అడిగాడు. రక్తం దొరకకపోవడం వల్ల అని తెలియడంతో, కావలసిన బ్లడ్ గ్రూప్ ఏదో కనుక్కుని, వారిని తన డ్యూటీ ఐపోయే టైమ్ 2.PM వరకే అక్కడే వెయిట్ చేయమన్నాడు. ఈ లోపలే ముగ్గురికీ లంచ్ కూడా తెప్పించాడు. డ్యూటీ ఐపోగానే, వారిని నేరుగా హాస్పిటల్ కి తీసుకెళ్ళి, తానే బ్లడ్ డొనేషన్ చేశాడు. రాత్రి పది గంటలకు బేబీ గర్ల్ పుట్టింది. పాపను చూసి, ఆ తర్వాతే ఇంటికెళ్ళాడు. తెల్లారేకల్లా , ఈ విషయం లోకల్ న్యూస్ లో రావడంతో, డిజీపీ 10000/- రూపాయలు పారితోషికం ప్రకటించాడు. కానిస్టేబుల్ ఆ పదివేలను బాలింతరాలికి గిఫ్టుగా ఇచ్చేశాడు.

పై ఫోటో కానిస్టేబుల్ దే, పేరు - యస్. సయ్యద్ అబూతాహిర్.

By Haneef Muhammad Shaik



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Inspiration"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0