Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Is Sugar Patients eat mangoes. .?

 షుగర్ పేషెంట్లు మామిడిపండ్లు తినొచ్చా . . 
Is Sugar Patients eat mangoes. .?

 వేసవిలో ఎక్కువ మంది తినేవి మామిడి పండ్లే . ఈ మామిడి పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి . మామిడి పండ్లు ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది . మామిడిలో సహజంగా జీర్ణక్రియకు సహాయపడే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి . మామిడి పండు గుండె జబ్బులు , టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి డైటరీ ఫైబర్ గా సాయపడుతుంది . పండిన మామిడి కంటే ఆకుపచ్చ మామిడిలో పెక్టిన్ ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది . జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడే వ్యక్తులు మామిడి పండ్లను తింటే ఉపశమనం లభిస్తుంది . మామిడి పండులో లభించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ రోగనిరోధక శక్తిని పెంచడానికి సాయపడుతుంది . జలుబు | ఫ్లూ వంటి వాటిని నివారిస్తుంది . మామిడిలో ఉన్న ఈ పోషకాలు శరీర వ్యాధి నిరోధక వ్యవస్థను మెరుగు పరచటానికి సాయపడుతుంది . మామిడి పండు కంటి ఆరోగ్యానికి చాలా మంచిది . మామిడి పండ్లలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది . ఇది విటమిన్ ఎ ఉత్పత్తికి సాయపడుతుంది . శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది . ఈ పండులోని విటమిన్ ఏ , కెరోటిన్ దృష్టి నష్టాన్ని నివారిస్తుంది . వయసుకు సంభందించిన కంటి వ్యాదులైన మాక్యులర్ క్షీణత , దృష్టి కోల్పోవడాన్ని , కంటి శుక్లాం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది . మామిడి పండు తినడం వల్ల చర్మ మృత రంధ్రాలు ఎక్స్ఫోలియేట్ చేయడానికి , తొలగించడానికి కూడా సాయపడుతుంది . మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండు తినకూడదనీ , తింటే ప్రమాదమన్న అపోహలు చాలానే ఉన్నాయి . నిజమే ఈ పండు తియ్యగా ఉండొచ్చు . అయితే దీన్ని మితంగా తీసుకోవచ్చు . అంతేకానీ తినకూడదని ఏమి లేదు . ఈ పండులోని గుణాలు టైప్ - 2 డయాబెటీస్ ను తగ్గించడానికి దోహదం చేస్తాయని అనేక పరిశోధనలు చెపుతున్నాయి . మామిడి మితంగా తింటే బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది . మామిడి పండు తొక్కలో ఉన్న ఫైటోకెమికల్స్ సహజ కొవ్వు బస్టర్లుగా పనిచేస్తాయి . మామిడి గుజ్జు ఫైబర్లతో నిండి ఉంటుంది . అధిక ఫైబర్ పండ్లు లేదా కూరగాయలను తినడం ద్వారా మీరు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్టు భావిస్తారు . ఇది ఇతర అధిక కొవ్వు స్నాక్స్ లో చిక్కుకోకుండా నిరోధిస్తుంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Is Sugar Patients eat mangoes. .?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0