Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Salary's were paid tomorrow, the same day as pensions.

వేతనాలు అందేది రేపే, పింఛన్లు అదే రోజు.
Salary's were paid tomorrow, the same day as pensions.

 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్ల చెల్లింపుపై ఆర్థికశాఖ, సీఎఫ్‌ఎంఎస్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కరోనావల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతిందంటూ ఉద్యోగుల వేతనాల్లో 10శాతం నుంచి 60శాతం వరకు, మరికొందరికి పూర్తిగానూ కోత వేసి మిగిలిన మొత్తాల్నే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించి జీవో ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తదనుగుణంగా చెల్లింపులకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో అందరికీ 3వ తేదీన వేతనాలు, పింఛన్ల చెల్లింపులు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు.
తాజాగా కరోనా నేపథ్యంలో వేతనాలను తగ్గించడంతో దానికి అనుగుణంగా సీఎఫ్‌ఎంఎస్‌ కేంద్ర వ్యవస్థ వద్ద మార్పులు చేసి చెల్లింపులకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేతనాలు, పింఛన్లను తాత్కాలికంగా తగ్గించినందున ఈ నెలలో సుమారు రూ.3000 కోట్లతో సరిపెట్టవచ్చని ఒక అంచనా. మరోవైపు ప్రతి కుటంబానికీ కరోనా సాయంగా రూ.1000 చొప్పున రూ.1300 కోట్ల చెల్లింపులు చేయాల్సి ఉంది. ఇప్పటికే రూ.1400 కోట్లు ఒక బ్యాంకు నుంచి రుణంగా సమకూర్చుకున్నారు. మరికొంత రుణం కోసమూ ప్రయత్నాలు సాగుతున్నాయి.
కేంద్ర సహకారం కోసం వినతి
మరోవైపు కరోనాతో ఆర్థికంగా తలెత్తిన ఇబ్బందులను ఎదుర్కొనేందుకు సహకారం కావాలని మార్చి నెలాఖరులో కేంద్రానికి రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు లేఖ రాశారు. అసలే రెవెన్యూ లోటుతో ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి కరోనా లాక్‌డౌన్‌తో మరిన్ని సమస్యలు వచ్చాయని అందులో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌ పేర్కొన్నారు. పౌరులకు అత్యవసర సేవలు అందించేందుకు, ఇప్పటికే చేయాల్సిన ఖర్చులకు అవసరమైన నిధుల కోసం తొలి త్రైమాసికంలో అదనంగా రూ.10వేల కోట్ల రుణం తీసుకునేందుకు వీలుగా సహకరించాలని కోరారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Salary's were paid tomorrow, the same day as pensions."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0