Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The mantra of health. . . Hot water

ఆరోగ్య మంత్రం . . . వేడినీళ్లు !
The mantra of health. . . Hot water

కరోనా నివారణ సూత్రాల్లో భాగంగా . . . మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్లు రోజంతా వేడినీళ్లు తాగుతూ ఉండమని సూచిస్తున్నారు .


  •  వేడినీళ్ల వల్ల శ్వాసకోశ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు . 
  • జీర్ణ క్రియను మెరుగుపరచడం దగ్గరి నుంచి రక్త ప్రసరణ దాకా గోరువెచ్చని నీరు చేయని మేలు లేదంటున్నారు . 
  • తగినన్ని నీళ్లు తాగకపోతే , జీర్ణవ్యవస్థ మనం తీసుకునే ఆహారం నుంచే నీటిని గ్రహిస్తుంది . 
  • దాంతో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది . తద్వారా జీర్ణ క్రియ మందగిస్తుంది . 
  • విసర్జనలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి .
  • ఇదంతా దీర్ఘకాలిక మలబద్దకానికి కారణం అవుతుంది . వేడినీళ్లు తాగడం వల్ల ఆహారం వేగంగా జీర్ణం అవుతుంది . పేగుల కదలిక మెరుగుపడి మలబద్దకం దూరం అవుతుంది . 

డీటాక్సిఫికేషన్ : వేడినీళ్లు శరీరంలోని మలినాలను వదలగొడతాయని చెబుతున్నారు నిపు ణులు . వేడినీళ్లు తాగినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరిగి , చెమట పడ్తుంది . తద్వారా వ్యర్థాలు బయ టికి వెళ్లిపోతాయి . 
రక్తప్రసరణ : వేడినీళ్లు రక్తనాళాలను వెడల్పు చేస్తాయి . వాటిలో ప్రయాణించే రక్తం మెరుగ్గా ప్రస రణ చెందుతుంది . రక్తప్రసరణ బాగుండటం వల్ల కండరాలు రిలాక్స్ అయ్యి , నొప్పులు తగ్గు తాయి . 
బరువు తగ్గడం : నీళ్లు తాగడం వల్ల పోషకాల పోషణ , వ్యర్థాల విసర్జన మెరుగ్గా జరుగుతాయి . వేడినీళ్లు తాగితే కచ్చితంగా బరువు తగ్గుతారని ఓ అధ్యయనంలో తేలింది . భోజనానికి ముందు అరలీటరు వేడినీటిని తీసుకోవడం వల్ల మెటబాలిజం 30 శాతం పెరిగిందని కూడా పరిశోధకులు చెప్తున్నారు .  
శ్వాస : జలుబు , దగ్గు ఉన్నప్పుడు వేడినీటి ఆవిరి పడితే ఎంతో ఉపశమనం కలుగుతుంది . అదే విధంగా వేడినీటిని తాగడం వల్ల లోపలున్న శ్లేష్మం వేగంగా కదులుతుంది . దాంతో కఫం అంతా బయటికి వెళ్లిపోతుంది . కాబట్టి , శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు , శ్వాసలో ఇబ్బందులు ఉన్నప్పుడు వేడినీ టిని పుచ్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.  
ఒత్తిడి : మానసిక ఒత్తిడి , ఆందోళన ఉన్నప్పుడు టీ , కాఫీలు తాగుతుంటాం . వీటివల్ల ఒత్తిడి ఎంతో కొంత తగ్గినట్టు అనిపిస్తుంది . అయితే వేడినీళ్లు తాగితే కూడా ఒత్తిడి నుంచి ఇలాంటి సాంత్వనే కలుగుతుంది . నాడీవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో వేడినీళ్లు లేదా వేడి కాఫీ - టీ - పాలు సహాయపడుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి . 
ముఖ్య గమనిక
కానీ . . . వేడినీళ్లు మంచివే కదా అని పొగలుగక్కే నీళ్లు తాగితే చిక్కుల్లో పడు డారు . వేడి వల్ల అన్నవాహికలోని కణజలుడ్యామేజి కావచ్చు . నాలుక మీదిరుచి మొగ్గలు దెబ్బతినవచ్చు . అందుకే గోరువెచ్చని నీరు ఎల్లవేళలా మంచిది . వ్యాయామంచేసేటప్పుడు మరీ ఎక్కువ వేడి వాతావరణంలో ఉన్నప్పుడు . . . వేడినీళ్లు తాగకూడదు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The mantra of health. . . Hot water"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0