Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The timing of power companies with Modi's call

మోదీ పిలుపుతో విద్యుత్ సంస్థల సమయత్తం
The timing of power companies with Modi's call

ఆదివారం రాత్రి లైట్లు ఆర్పే సమయంలో విద్యుత్ గ్రిడ్​పై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు ఆయా రాష్ట్రాల విద్యుత్​ సరఫరా, పంపిణీ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఒక్కసారిగా లోడ్​ తగ్గిపోతే దాని ప్రభావానికి గ్రిడ్ కుప్పకూలే ప్రమాదం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో చర్యలు చేపట్టాయి. బ్లాకౌట్​ నిర్వహించటం ఇదే మొదటి సారి కాదని.. జాతీయ గ్రిడ్​పై ఎలాంటి ప్రభావం ఉండబోదని స్పష్టం చేశాయి.

కరోనాపై పోరులో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు ఇళ్లల్లోని విద్యుత్​ లైట్లు ఆర్పి ఐక్యతను చాటాలన్న ప్రధాని మోదీ పిలుపుతో బ్లాకౌట్ (అంధకారం)​కు స్టేట్​ లోడ్​ డిస్పాచ్​ కేంద్రాలు (ఎస్​ఎల్​డీసీ), విద్యుత్​ ట్రాన్స్​మిషన్​ సంస్థలు సమాయత్తమవుతున్నాయి. విద్యుత్​ గ్రిడ్​పై ఏదైనా ప్రతికూల ప్రభావం ఏర్పడితే దానిని పరిష్కరించేందుకు అనుసరించాల్సిన చర్యలకు సిద్ధమవుతున్నాయి.రాత్రి 9 గంటల ప్రాంతంలో అత్యధికంగా విద్యుత్ డిమాండ్​ ఉంటుంది. ఆ సమయంలో ఒక్కసారిగా లోడ్​ తగ్గిపోతే గ్రిడ్​పై అధిక ప్రభావం పడుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే.. ఈనెల 2న విద్యుత్ డిమాండ్​ గతేడాదితో పోల్చితే 25 శాతం (125.81జీడబ్ల్యూ) మేర తగ్గిపోయింది.అయితే.. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న కారణంగా గ్రిడ్ స్థిరత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదని విద్యుత్​ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.యూపీ ఎస్​ఎల్​డీసీ ఆదేశాలు..విద్యుత్ డిమాండ్​ ఒక్కసారిగా తగ్గిపోతే అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్తు సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది ఉత్తరప్రదేశ్​ స్టేట్​ లోడ్​ డిస్పాచ్​ కేంద్రం(ఎస్​ఎల్​డీసీ). రాష్ట్ర గ్రిడ్​లోని అన్ని రియాక్టర్లను ఆన్​లో ఉంచుతూ.. కెపాసిటర్​ బ్యాంకును ఆఫ్​ చేయాలని సూచించింది. రాత్రి 8-9 గంటల మధ్య లోడ్​ను క్రమంగా తగ్గిస్తూ విద్యుత్ గ్రిడ్​పై ప్రభావాన్ని తగ్గించాలని పేర్కొంది.తమిళనాడులోనూ..ఉత్తర్​ప్రదేశ్​ ఎస్​ఎల్​డీసీ చేసినటువంటి సూచనలే చేసింది తమిళనాడు ట్రాన్స్​మిషన్​ కార్పోరేషన్​. ఆదివారం రాత్రి బ్లాకౌట్​ సమయంలో అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని కోరింది. ఎస్​ఎల్​డీసీ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.ఇదే తొలిసారి కాదు..బ్లాకౌట్​ సమయంలో విద్యుత్ డిమాండ్​ సుమారు 10-12 గిగావాట్లు తగ్గుతుందని అధికారులు అంచనావేస్తున్నారు. ఇది జాతీయ పవర్​ గ్రిడ్​పై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా బ్లాకౌట్​ నిర్వహించటం ఇదే మొదటి సారి కాదని.. ఎర్త్​ అవర్​ వంటి పలు సందర్భాల్లో బ్లాకౌట్​ నిర్వహించినట్లు గుర్తు చేశారు.విపక్షాల విమర్శలు..దేశవ్యాప్తంగా ప్రజలు విద్యుత్ దీపాలను ఆర్పాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును విపక్షాలు విమర్శించాయి. ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రజలు లైట్లు ఆర్పకూడదని ఓ కేంద్ర మంత్రి కోరటం గమనార్హం.2012లో..సాంకేతిక కారణాలతో 2012లో గ్రిడ్​ విఫలమై దేశం అంధకారంలోకి వెళ్లింది. అయితే.. ప్రస్తుతం పటిష్ఠమైన ట్రాన్స్​మిషన్​ నెట్​వర్క్​ ఉంది. పవర్​ డిమాండ్​లో హెచ్చుతగ్గులు ఏర్పడినా దానిని తట్టుకునే శక్తి ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The timing of power companies with Modi's call"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0