Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Govt Health Dept Notification 2020: 9700 Volunteer/Doctors/Specialist posts

9,700 ‘వైద్య’ పోస్టులు
ఒకే నోటిఫికేషన్‌ ద్వారా భర్తీకి సీఎం వైఎస్‌ జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌
నేడో, రేపో ఉత్తర్వులు జారీ చేయనున్న వైద్య ఆరోగ్య శాఖ
AP Govt Health Dept Notification 2020: 9700 Volunteer/Doctors/Specialist posts

AP Medical Department COVID-19 Recritment 2020: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరోనా నియంత్రణకు కొత్తగా వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందికి భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కేఎస్‌ జవహర్‌రెడ్డి పేర్కొన్నారు.


రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో గత పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఒకే నోటిఫికేషన్‌ ద్వారా 9,700 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. వైద్య విద్యా శాఖలో.. బోధనాస్పత్రులు, వైద్య విధాన పరిషత్‌లో.. సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ప్రజారోగ్య శాఖ పరిధిలో.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేందుకు స్పెషలిస్టు డాక్టర్ల నుంచి స్టాఫ్‌ నర్సుల వరకు మొత్తం 9,700 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ నియామకాల నోటిఫికేషన్‌ను నేడో, రేపో జారీ చేయనున్నారు
వైద్య విద్యాశాఖ పరిధిలో 15 కొత్త వైద్య కళాశాలలు, నాడు–నేడులో భాగంగా ఆస్పత్రి భవనాల పునర్నిర్మాణం, కొత్త భవనాల నిర్మాణం వంటి పలు కార్యక్రమాలు చేపట్టింది.

మూడేళ్ల ప్రొబేషనరీ..


  • ఎంపికైన వైద్యులు మూడేళ్ల పాటు ప్రొబేషనరీ పీరియడ్‌లో ఉంటారు.
  •  ఆ తర్వాత వారి సర్వీస్‌ రెగ్యులర్‌ అవుతుంది.
  • కొత్తగా ఎంపికయ్యే వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుకు అనుమతి లేదు. 
  • బేసిక్‌ శాలరీలో 15 శాతం ఎన్‌పీఏ (నాన్‌ ప్రాక్టీసింగ్‌ అలవెన్స్‌) ఇస్తారు.
  • ఎంపికైన వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది ఒక ఏడాది విధిగా గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
  • వైద్యులు, కొన్ని విభాగాల్లో స్టాఫ్‌ నర్సులు, పరిపాలనా సిబ్బందిని మాత్రమే రెగ్యులర్‌ ప్రాతిపదికన నియమిస్తారు.
  • ల్యాబ్‌ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డెంటల్‌ అసిస్టెంట్‌ వంటి మిగతా పోస్టులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో భర్తీ చేస్తారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Govt Health Dept Notification 2020: 9700 Volunteer/Doctors/Specialist posts"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0