Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jagan Sarkar's key decision on pensions .... removal of their names ...?

పింఛన్ల విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం.... వారి పేర్లు తొలగింపు...?
Jagan Sarkar's key decision on pensions .... removal of their names ...?

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పింఛన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పింఛన్ల జారీ విషయంలో కీలక మార్పులు చేశారు. ప్రభుత్వం ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్ విధానాన్ని పక్కాగా అమలు చేయనుంది. ఇప్పటికే అధికారులకు పింఛన్ల జారీకి సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వం రాష్ట్రంలో ఒకే కుటుంబంలో ఒకటికి మించి పెన్షన్ తీసుకుంటుంటే వాటిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.

క్యాన్సర్, తలసేమియా, పక్షవాతం, కిడ్నీ డయాలసిస్ రోగులు, దివ్యాంగుల పింఛన్లకు మాత్రం ఈ నిబంధనల నుంచి మినహాయింపులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రజాసాధికారక సర్వే, ఆధార్ కార్డు, ఇతర వివరాల ఆధారంగా ఒకే రేషన్ కార్డుపై రెండు పింఛన్లు పొందుతున్న వారి వివరాలను సేకరించింది.
 వివరాలను మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలకు పంపించింది.

ఈ నెల 15వ తేదీలోపు ఆ వివరాలను మరోసారి పరిశీలించి ఒకటికి మించి పింఛన్ పొందుతుంటే రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు గ్రామ, వార్డు స్థాయిలో పింఛన్లను ఇప్పటికే పరిశీలిస్తున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ నుంచి ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.

రాష్ట్రంలో నిన్న 33 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 2051కు చేరింది. రాష్ట్రంలో 46 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 584 కరోనా కేసులు నమోదు కాగా విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 4 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ ఉండటంతో ప్రజల్లో భయాందోళన తగ్గుతోంది.

Check your pension status

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jagan Sarkar's key decision on pensions .... removal of their names ...?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0