Breaking down: Approval for bus services in AP

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా రవాణాపై కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం జారీ చేసిన కొత్త మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించింది. అటు ప్రైవేటు బస్సులకు కూడా అనుమతివ్వాలని సీఎం జగన్ నిర్ణయానికి వచ్చారు. ఇదిలా ఉంటే కరోనా నేపధ్యంలో పలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు.
అటు బస్టాండ్ నుంచి బస్టాండ్ వరకూ మాత్రమే బస్సు సర్వీసులను నడపాలని.. మధ్యలో ఎక్కేందుకు అనుమతి లేదని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాక బస్సు ఎక్కిన ప్రయాణీకుల పూర్తి వివరాలను సేకరించాలని.. వారు బస్టాండులో దిగగానే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
మరోవైపు బస్సులో ప్రయాణించేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని వెల్లడించారు.
మరోవైపు 50 శాతం సీట్లు మాత్రమే నింపాలని.. ప్రతీ బస్సుకు 20 మందికి మాత్రమే అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటు ప్రైవేట్ వాహనాల్లో ముగ్గురికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. కాగా, బస్సు సర్వీసులు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయనేది మాత్రం నాలుగు రోజుల్లో ప్రకటిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. కాగా, అంతర్ రాష్ట్ర సర్వీసులను ఎలా నడపాలన్న దానిపై చర్చించిన ఆయన.. మొదటిగా హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాల నుంచి రావాలనుకుంటున్న వారి కోసం బస్సు సర్వీసులను నడపడంపై దృష్టి సారించాలని అధికారులకు తెలిపారు.

0 Response to "Breaking down: Approval for bus services in AP"
Post a Comment