Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Central Government's decision on Lockdown 3.0 Modi speech tomorrow!

లాక్​డౌన్ 3.0పై కేంద్రం కసరత్తు-రేపు ప్రధాని మోదీ గారి ప్రసంగం!
Central Government's decision on Lockdown 3.0  Modi speech tomorrow!

కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా అమలు చేసిన లాక్​డౌన్​ మరో 2 రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యచరణపై చర్చించేందుకు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. లాక్​డౌన్​ కొనసాగింపు, కార్యాచరణపైనే ప్రధానంగా చర్చించారు. స్వల్ప సడలింపులతో మరోసారి లాక్​డౌన్​ను​ పొడిగించే అంశంపై సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. మే 3న లాక్​డౌన్​ గడువు తీరిపోనుండగా.. ఒక్కరోజు ముందు జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించే అవకాశాలున్నాయి.    దేశంలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపైనా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ను అడిగి తెలుసుకున్నారు ప్రధాని. కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్​ గోయల్​, కేబినెట్​ కార్యదర్శి రాజీవ్​ గౌబా తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన దూరప్రాంతాల వారిని రైళ్లలో తరలించే విషయంపైనా మోదీ చర్చించారు. 
 నిరంతరం సమీక్ష...
దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ పరిస్థితులపై ప్రధాని.. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు. ఇకపై ఆర్థిక కార్యకలాపాలను కొనసాగిస్తూనే కరోనాపై పోరాటం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెడ్​జోన్లు మినహా.. మిగతా జోన్లలో ఆంక్షలు సడలించాలని చూస్తోంది.కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్​డౌన్​కు ముందు మార్చి 22న తొలిసారి సీఎంలతో చర్చించిన ప్రధాని.. మార్చి 24న 21 రోజుల లాక్​డౌన్ అమలు చేస్తున్నట్లు​ ప్రకటించారు. అనంతరం.. ఏప్రిల్​ 11న మరోసారి వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించి లాక్​డౌన్​ను 19 రోజులు పొడిగించారు.  చివరగా ఏప్రిల్​ 27న ముఖ్యమంత్రులతో మాట్లాడిన మోదీ... ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.  లాక్​డౌన్​ అనంతరం.. ఎలా ముందుకెళ్లాలని అభిప్రాయాలను కోరారు. చాలా మంది లాక్​డౌన్​ కొనసాగింపుపైనే మొగ్గు చూపగా... కేంద్రం కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నట్లు సమాచారం.   
 మంత్రులతో మోదీ కీలక భేటీ- లాక్​డౌన్ 3.0పై కసరత్తు!

  • కరోనాకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కీలక సమావేశం.
  • సమావేశానికి హాజరైన హోంమంత్రి అమిత్ షా, రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్, క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా.
  • లాక్ డౌన్ కొనసాగింపు, తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Central Government's decision on Lockdown 3.0 Modi speech tomorrow!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0