Covid-19 An dhrapradesh app download
ఇంటి వద్దే కరోనా పరీక్షలు
మొబైల్ యాప్‌లో పేరు నమోదు చేసుకుంటే చాలు
ఏపీ కోవిడ్–19 యాప్‌కు పెరుగుతున్న ఆదరణ
మొబైల్ యాప్‌లో పేరు నమోదు చేసుకుంటే చాలు
ఏపీ కోవిడ్–19 యాప్‌కు పెరుగుతున్న ఆదరణ
- ఇప్పటివరకు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారు 50,000
- లక్షణాలున్న వారిని గుర్తించింది 717 చేసిన టెస్టులు 34
- ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు వంటి కరోనా వైరస్ లక్షణాలుంటే కంగారు పడక్కర్లేదు. ఎక్కడికెళ్లాలి, ఎవర్ని సంప్రదించాలనే దానిపై ఆందోళన చెందాల్సిన పనిలేదు
- ఇంటి వద్దకే వచ్చి పరీక్షలు నిర్వహించడం ద్వారా కరోనా ఉందో లేదో చెప్పే వినూత్న ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి చేయాలిందల్లా ఓ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడమే.
- GOOGLE ప్లే స్టోర్‌లోకి వెళ్లి ‘కోవిడ్–19 ఏపీ’ మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని.. అందులో పేరు నమోదు చేసుకుంటే చాలు.
- ఎవరికైనా కరోనా లక్షణాలుంటే వైద్యులు ఇంటి దగ్గరకు వచ్చి పరీక్షలు చేస్తారు. పాజిటివ్ వస్తే.. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి హోం ఐసొలేషన్‌లో ఉంచడం లేదా ఆస్పత్రికి తీసుకెళ్లడం చేస్తారు.
- రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా బాగా చర్చనీయాంశమైంది.*
- యాప్ ఉంటే చాలు.
- స్మార్ట్ ఫోన్‌లో ‘కోవిడ్–19 ఏపీ’ యాప్ ఉంటే సరిపోతుంది. యాప్ డౌన్‌లోడ్ చేసుకునే సందర్భంలో సంబంధిత వ్యక్తి పేరు, ఆ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయనే దానికి సమాధానాలు ఇవ్వాలి.
- యాప్ డౌన్‌లోడ్ చేసుకోగానే సదరు వ్యక్తి ఫోన్ నంబర్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల పరిశీలనలోకి వెళుతుంది.
- సంబంధిత వ్యక్తికి గల లక్షణాలను బట్టి ఏఎన్‌ఎం లేదా మెడికల్ ఆఫీసర్ ఇంటి వద్దకే వస్తారు.
- లక్షణాలను పరిశీలించిన తర్వాత కరోనా పరీక్షలు అవసరమో లేదో నిర్ధారించి అవసరమైతే అక్కడే చేస్తారు. నిర్ధారణ అనంతరం ఫలితాన్ని కూడా ఆ మొబైల్‌కే పంపిస్తారు.
- ఈ యాప్‌లో మన ఇంటికి సమీపంలో ఉండే నర్సులు, డాక్టర్ల వివరాలు అందుబాటులో ఉంటాయి.
- యాప్‌లో మనం ఇచ్చిన సమాచారం మేరకు ఆరోగ్య శాఖ మన ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉంటుంది
- టెస్టులు అవసరం లేదనుకుంటే వ్యాధి తీవ్రతను బట్టి మందులు సూచిస్తారు.
Covid-19 An dhrapradesh app download
0 Response to "Covid-19 An dhrapradesh app download"
Post a Comment