Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Do teacher transfers happen!

ఉపాధ్యాయ బదిలీలు జరిగేనా!
Do teacher transfers happen!

 వివిధ రకాల పదోన్నతులు , పోస్టుల ఉన్నతికరణ, పదవీ విరమణ తదితర కారణాల వల్ల ఉపాధ్యాయులు లేని పాఠశాలలు మరికొన్ని ఏకోపాధ్యాయ పాఠశా లలుగా మిగిలిపోయాయి . అన్ని శాఖల్లో సాధారణ బదిలీలు జరిగినా , కేవలం విద్యాశాఖలో జరపకపో వడం శోచనీయం . గత రెండు , మూడు సంవత్స రాల నుండి బదిలీలు జరపకపోవడంతో లా డాన్ తర్వాత సెలవులోనైనా జరిగేసా అనే సందిగ్ధంలో ఉన్నారు . ఉపాధ్యాయులు . బదిలీలపై నూతన విద్యా సంవత్సరంలోపు బదిలీలు జరపాలంటున్న ఉపా ధ్యాయ సంఘాలు . గత రెండు , మూడు సంవత్స రాల నుండి బదిలీలపై ఎన్నో ఆశలు పెట్టుకొని మారుమూల ప్రాంతాల యందు చాలామంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు . గత ప్రభుత్వం బదిలీలు జరపకపోవడంతో కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు . ఇప్పటికే వివిధ రకాల పదోన్నతులు , పోస్టుల ఉన్నతీకరణ , పదవీ విరమణ తదితర కారణాల వల్ల ఉపాధ్యాయులు లేని పాఠశాలలు , మరికొన్ని ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మిగిలిపోయాయి . ఉపాధ్యాయులు లేని పాఠశాలలు , ఏకోపాధ్యాయ పాఠశాలలను , బదిలీకరణ ద్వారా ఖాళీలను భర్తీచేయాలి . బదిలీలు జరపకపోవడం వల్ల అనుకూలమైన స్థానాల్లో ఉన్నపారు . పది సంవత్సరాలు దాటినా అలాగే కొనసాగడం జరుగుతుంది . 2015 వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అక్టోబర్ నెలలో బదిలీలు జరిపారు . 2017 సంవత్సరంలో వెబ్ కౌన్సిలింగ్ కాకుండా సాధారణ బదిలీలు ఆగస్టు నెలలో జరిపారు . ఈసారైనా నూతన విద్యా సంవత్సరం ప్రారంభమయ్యలోపు బదిలీల ప్రక్రియ పూర్తయితే విద్యార్థులకు ఎటువంటి నష్టం కలగదు . బదిలీలపై నేటివరకు ప్ర స్తావన లేకపోవడంతో సెలవులో ఉపాధ్యాయ బదిలీలు ఉన్నట్లా , లేనట్లా అనేది సందేహంలోఉన్నారు . ఉపాధ్యాయులు , ప్రతిఏటా ప్రభుత్వాలు ఉపాధ్యాయుల్లో బదిలీ ఆశలు కల్పించి చివరకు ఉసూరుమనిపిస్తుందని ఆవేధన చెందుతున్నారు . ఇప్పటికైనా ప్రభుత్వం బదిలీలపై మార్గదర్శకాలు , విధి విధానాలు రూపకల్పన చేయాలి . ఏళ్ల తరబడి మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్నా తమకు దక్కాల్సిన మంచి స్థానాలు పదోన్నతులు పొందిన పారు చేజిక్కించుకుంటున్నారని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . పైగా 2008 డీఎస్సీ అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది . ప్రస్తుతం అభ్యర్థులు పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు . వీరికి మంచి స్థానాల్లోనే పోస్టి గ్లు దక్కుతాయని , తర్వాత బదిలీలు చేపట్టినా ఏళ్ల తరబడి మారుమూల ప్రాంతాల్లో పనిచేసే పారికి అన్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు . 
వెబ్ కౌన్సిలింగ్ శ్రేయస్కరం !
 జనరల్ కౌన్సిలింగ్ ద్వారా అనేక అసౌకర్యాలకు ఉపాధ్యాయులు గురు వుతున్నారు . ఉపాధ్యాయులు వెబ్ కౌన్సిలింగ్ ద్వా రా పనిదినాలు , సమయం వృధా కాదు . అవకత వకలకు , పైరవీలకు అవకాశం ఉండదు 
 క్యాటగిరి ప్రకారం బదిలీల్లో ప్రాధాన్యం కల్పించాలి 
ఉపాధ్యాయ బదిలీల యందు క్యాటగిరీల పారిగా ప్రాధాన్యత కల్పించాలి . మొదటి క్యాటగిరీలో పనిచేసే పారే రెండవ క్యాటగిరీకి , రెండవ క్యాటగిరి పారే మొదటి క్యాటగిరీకి , మూడవ , నాల్గవ క్యాటగిరీలు జీవిత కాలం ఆ క్యాటగిరీ స్థానాలకి పరిమితమవుతున్నారు . మూడవ , నాల్గవ క్యాటగిరీ పారికి ఈ విధంగా తీవ్ర అన్యాయం జరుగుతుంది 
సింగిల్ ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం : 
బదిలీల్లో సింగిల్ ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారు . భార్య , భర్తలు ఉపాధ్యాయురైతే హెర్ఆన్డితో పాటు డబుల్ సాలరీ , పాయింట్స్ పాటు మంచి స్థానాలు దక్కించుకుంటున్నారు . సింగిల్ ఎంప్లాయ్ లు జీవితాంతం మూడవ , నాల్గవ క్యాటగిరీ స్థానాలకి పరిమితమవుతున్నారు . ఈ సారైనా సింగిల్ ఎంప్లాయ్ కి స్యాయం చేయాలి .
ప్రిపరెన్స్ విభాగంలో మార్పులు చేయాలి ?
 ప్రిపరెన్స్ విభాగంలో పాయింట్లు అనేవి కొంత పైరవీలకు , అక్రమాలకు అవకాశం ఉంటుంది . ఇలా జరగడం వల్ల కొంతమంది ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత కనబరుస్తున్నారు . 
ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు ,
మొదటగా క్రమబద్ధీకరణ జరిపి , ఆతర్వాత బదిలీలు నిర్వహించాలి . డీఎసి 2018 అభ్యర్థులను నియమించాలి . కొత్త ప్రభుత్వం నూతన డీఎస్సీని ప్రకటించాలి . ప్రస్తుత పరిస్థితుల్లో వెబ్ కౌన్సిలింగ్ మంచిది . ప్రిఫరెన్స్ అనేది . అనవసర పాయింట్లు , ప్రత్యేక పాయింట్లుగా ఇవ్వకూడదని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె . సురేష్ కుమార్ వెల్లడించారు .  వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు సరైన మార్గం . మూడవ , సాల్గవ క్యాటగిరీల పారికి ప్రాధాన్యత ఇవ్వాలి . స్టేషన్ , టోటల్ సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాలి . 75 శాతం పిహెచ్ పారికి ప్రిపరెన్స్ లో ప్రాధాన్యత ఇవ్వాలని ఎఏ జిల్లా అధ్యక్షులు వై ధనుంజయరెడ్డి వెల్లడించారు . ఈ ఉపాధ్యాయ బదిలీలను ప్రభుత్వం ) సర్వీతో కానీ , రెండు సంవత్సరాల సర్వీసు గరి షంగా 8 సంవత్సరాల సర్వీసు అర్హత కల్పించాలి . కరోనా లా డాన్ కారణంగా వెబ్ కౌన్సిలిం ద్వారా బదిలీలు చేపట్టాలి . ఉపాధ్యాయులు ఫోన్ ద్వారానే అప్లయ్ చేసుకునే విధంగా సాఫ్టువేర్‌ను ఏర్పాటుచే ' యాలని ఎస్ జిటిఎఫ్ రాష్ట్ర నాయకులు పూజారి లక్ష్మయ్య వెల్లడించారు . ఈ వేసవికాలంలో బదిలీలు నిర్వహించాలి . మొదట క్రమబద్దీకరణ జరగాలి , వెబ్ కౌన్సిలింగ్ ఉత్తమం , బదిలీలు సంవత్సరం మధ్యలో జరిగితే ఉపాధ్యాయులకు , విద్యార్థులకు తీవ్ర నష్టం అని బిటిపి జిల్లా అధ్యక్షులు డి రామశేషయ్య వెల్లడించారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Do teacher transfers happen!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0