Highlights of the video conference with the Minister of Education and union leaders
Highlights of the video conference with the Minister of Education and union leaders.
విద్యాశాఖ మంత్రి 'శ్రీ ఆదిమూలపు సురేష్ 'గారు & ఉన్నతాధికారులతో ఉపాధ్యాయ సంఘాల నాయకుల వీడియో కాన్ఫరెన్స్ ముఖ్యాంశాలు...
విద్యాశాఖ మంత్రి 'శ్రీ ఆదిమూలపు సురేష్ 'గారు & ఉన్నతాధికారులతో ఉపాధ్యాయ సంఘాల నాయకుల వీడియో కాన్ఫరెన్స్ ముఖ్యాంశాలు...
- ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు, రాష్ట్ర విద్యా శాఖ అధికారులు శ్రీ సుబ్బారెడ్డి గారు, శ్రీ ప్రతాప్ రెడ్డి గారు మరియు ఇతర ఉన్నతాధికారులతో ఈరోజు సంఘ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్ లో పదవ తరగతి పరీక్షల పై, 2020-21 విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండరు, ఇంకా అజెండాలో లేకున్నా బదిలీలపై వివిధ సంఘాల నాయకులు పాల్గొని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.
- 1) ప్రస్తుత COVID 19 నేపథ్యంలో పదవతరగతి పరీక్షలు FA1, FA 2, FA3, FA4 మరియు SA 1 మార్కుల ఆధారంగా పాస్ చేయాలని సూచించడమైనది.
- 2) ఒకవేళ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలంటే ఏ స్కూలు ఆ స్కూల్ లోనే (Self center) సెంటర్గా ఏర్పాటుచేసి రాష్ట్రంలో విద్యార్థి ఎక్కడ చదువుతున్న వారు ఏ సెంటర్లో కోరుకుంటే లేదా ఏ సెంటర్ వద్ద నివాసము ఉంటే ఆ సెంటర్లో రాసే విధంగా చర్యలు తీసుకోవాలి.
- 3) పరీక్ష స్పాట్ వాల్యుయేషన్ విధానం యూనివర్సిటీలో జరిగే విధంగా ఇంటివద్దకే పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పంపించి, ఇంటివద్దనే స్పాట్ వాల్యుయేషన్ చేయించి తిరిగి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా విద్యాశాఖకూ చేరే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించడమైనది.
- 4) పాఠశాల అకాడమిక్ ఇయర్ ఆగస్టులో ప్రారంభించి దసరా సెలవులలో సగం దినాలు, సంక్రాంతి సెలవుల్లో సగం దినాలు తగ్గించడం (రెండవ శనివారం ఆదివారాలు తప్పనిసరిగా సెలవు ఉండాలి), ఏప్రిల్ 30 వరకు పాఠశాలను కొనసాగించాలి.
- 5) అలాగే పాఠశాల పనిదినాలు 220 నుండి కోవిడ్ నేపథ్యంలో 200 లకు తగ్గించాలి. అలాగే సిలబస్ను తగ్గించాలి.
- 6) బదిలీలు ఆన్లైన్ ద్వారా నిర్వహించి (పాఠశాల ప్రారంభం లోపల), రేషనలైజేషన్ గతంలో లాగా కాకుండా 1:20 or 1: 25 విధానంలో నిర్వహించాలని కోరడమైనది.
Very good suggestion.FA 1 to 4 marks can be reduced for 25,SA-1 marks can be reduced for 25 andarks obtained in Pre final can be reduced for 50 marks.Asking the students for public examinations at this time is not at all advisable
ReplyDelete2020-21 విద్యా సం.రము ఆగస్టు నుండి ఏప్రియల్ వరకు మార్చవచ్చు.కానీ ప్రస్తుత పరిస్థితుల్లో హాస్టళ్లు మరియు గురుకుల విద్యాలయాలను పునః ప్రారంభించడం అత్యంత సాహోపేతం ఔతుంది.కాబట్టి విద్యార్థులను సమీప పాఠశాలలకు సర్దుబాటు చేయడం మంచిది.అమ్మ ఒడి ద్వారా వారి భోజన ఖర్చుల మొత్తాన్ని వారి తల్లుల ఖాతాలకు జమచేయ వచ్చును
ReplyDeleteConducting Xth exams is not correct decision. Better to follow unions suggestions
ReplyDelete