Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

If traveling, the Erules must follow

ప్రయాణాలు చేయాలా ఐతే ఈరూల్స్ పాటించాల్సిందే.
If traveling, the Erules must follow

ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా విమాన, రైలు, అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి ఇచ్చింది కేంద్రం. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ దేశీయ ప్రయాణాలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. భౌతిక దూరం, మాస్కులు ధరించడం, థర్మల్ స్కానింగ్ తప్పనిసరి అని పేర్కొంది.

అవి:

  • విమాన, రైలు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు పునరుద్ధరణ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశీయ ప్రయాణాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. 
  • సంబంధిత ఏజెన్సీలు ప్రయాణికులకు... టికెట్లతో పాటు చేయకూడని, చేయదగిన విషయాలనుతెలపాలి.
  • ప్రయాణికులందరూ తమ మొబైల్ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్ టెర్మినల్స్... విమానాలు, రైళ్లు, బస్సులలో అనుసరించాల్సిన ముందు జాగ్రత్త చర్యలతో సహా కరోనా గురించి తగిన ప్రకటనలు చేయాలి.
  • ప్రయాణికులందరూ తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అందుకు తగిన ఆదేశాలు జారీ చేస్తాయి.
  • కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే విమాన, రైలు, బస్సుల్లో వెళ్లడానికి అనుమతివ్వాలి.
  • బోర్డింగ్, ప్రయాణ సమయంలో ప్రయాణికులందరూ ముఖం కప్పుకుని ఉండాలి లేదా మాస్క్‌ తప్పని సరిగా ధరించాలి.
  • చేతుల పరిశుభ్రత, శ్వాసకోశ పరిశుభ్రత, పర్యావరణ పరిశుభ్రతను పాటించేలా చర్యలు తీసుకోవాలి.
  • విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్ టెర్మినల్స్ వద్ద భౌతిక దూరం పాటించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
  • విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్​ను క్రమం తప్పకుండా శుభ్రపరచాలి.
  • క్రిమిసంహారకాలను పిచికారీ చేయాలి. సబ్బులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.
  • నిష్క్రమణ పాయింట్ వద్ద కూడా థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలి.
  • రోగ లక్షణాలు లేని ప్రయాణికులు 14 రోజులు వారి ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలన్న సలహాతో వెళ్లడానికి అనుమతి ఇవ్వాలి.
  • ఒకవేళ వారికి ఏవైనా లక్షణాలు కనిపిస్తే.. జిల్లా నిఘా అధికారికి లేదా రాష్ట్ర లేదా జాతీయ కాల్ సెంటర్‌ 1075కు తెలియజేయాలి.
  • రోగలక్షణాలు ఉన్నవారిని వేరుచేసి సమీప కరోనా ఆసుపత్రికి తీసుకువెళ్లే ఏర్పాట్లు చేయాలి.
  • మితమైన లేదా తీవ్రమైన లక్షణాలు ఉన్నవారిని ఐసొలేషన్‌ చేసి.. 
  • సమీపంలో ఉన్న కరోనా‌ చికిత్సా కేంద్రానికి తరలించాలి. 
  • అక్కడ చికిత్స ఏ స్థాయిలో తీసుకోవాలో నిర్ణయిస్తారు.
  • తేలికపాటి లక్షణాలు ఉన్నవారికి ఐసీఎంఆర్‌ నిబంధనల‌ ప్రకారం..
  •  సెల్ఫ్​ ఐసొలేషన్​లో‌ ఉంచడమో లేక కరోనా కేర్ సెంటర్‌లో తగిన చికిత్స అందించడమో చేస్తారు.
  • కరోనా పాజిటివ్‌ అని తేలితే.. క్లినికల్ ప్రోటోకాల్ ప్రకారం కరోనా కేర్ సెంటర్‌లో కొనసాగాల్సి ఉంటుంది.
  • నెగెటివ్‌ వస్తే.. ప్రయాణికులు 7 రోజుల్లో ఇంటికి వెళ్లి, స్వీయ నిర్బంధంలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలి. 
  • ఆ తర్వాత కరోనా లక్షణాలు కనిపిస్తే.. స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలి.
  • క్వారంటైన్‌ లేదా ఐసొలేషన్​పై రాష్ట్రాలు సొంత నిబంధనావళిని పాటించవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "If traveling, the Erules must follow"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0