Increased gas prices
ఒకటో తేదీ ఝలక్.. పెరిగిన గ్యాస్ ధరలు..
LPG Gas Cylinder Price Hike: ఒకటో తేదీనే ప్రజలకు షాక్ ఇస్తూ.. వంట గ్యాస్ ధరలను పెంచాయి గ్యాస్ కంపెనీలు. దీంతో గ్యాస్ వినియోగదారులపై కాస్త ప్రభావం పడనుంది. జూన్ 1వ తేదీ నుంచి ఈ కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి. సిలిండర్ ధర పెంపును పరిశీలిస్తే.. 14.2 కేజీల నాన్ సబ్సీడీ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరపై అదనంగా రూ.11.5 పెరిగింది. దీంతో సిలిండర్ ధర రూ.593కి చేరింది. అలాగే 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరపై రూ.110 పెరిగింది. దీంతో గ్యాస్ సిలిండర్ ధర రూ.1139కి ఎగసింది.
కాగా మే నెలలో వంట గ్యాస్ ధర రూ.744 నుంచి రూ.581.50కి తగ్గించారు. అందుకు కారణం అంతర్జాతీయంగా ఫ్యూయల్ ధరలు తగ్గడమే. అయితే జూన్ నెల వచ్చేసరికి అంతర్జాతీయంగా ఫ్యూయల్ ధరలు పెరిగాయి.
అందువల్ల తామూ పెంచాల్సి వచ్చిందని గ్యాస్ కంపెనీలు చెబుతున్నాయి. కాగా ఈ పెంపు ప్రధానమంత్రి ఉజ్వల్ స్కీమ్ లబ్ధిదారులకు వర్తించదని ఇండేన్ గ్యాస్ కంపెనీ తెలిపింది. ఈ లబ్ధిదారులు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్‌లో భాగంగా జూన్ 30 వరకూ ఉచిత సిలిండర్ పొందే ఛాన్స్ ఉంది.

0 Response to "Increased gas prices"
Post a Comment